ముషీరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో చిత్తు కాగితంతో సమానమని బీసీ పొలిటికల్ ఫ్రంట్ విమర్శించింది. ఆదివారం చిక్కడపల్లిలోని తమ కార్యాలయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోను కాల్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఫ్రంట్ కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్, బైరా శేఖర్, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..
కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లతో పాటు 42 హామీలు ఇచ్చారన్నారు. ఇందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. 42 శాతం రిజర్వేషన్లకు బదులుగా సర్పంచ్ ఎన్నికల్లో 17 శాతం కూడా సరిగ్గా ఇవ్వలేదని మండిపడ్డారు. తెర వెనుక రెడ్డి సామ్రాజ్యాన్ని నిర్మించాలనే కుట్ర జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో అంబాల నారాయణగౌడ్, నగేశ్గౌడ్, గోపి పాల్గొన్నారు.
