
మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఇందిర గాంధీ 37వ వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని ఆమె సమాధి శక్తి స్థల్‌ను ఎంపీలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, పవన్ కుమార్ బన్సల్, ఇతర సీనియర్ నేతలు సందర్శించారు. ఇందిర సమాధి దగ్గర నివాళులర్పించిన రాహుల్.. కాసేపు మౌనంగా కూర్చుండిపోయారు.