ఢిల్లీ లొల్లికి గల్లీల్లో మద్దతు...పలుచోట్ల కేంద్ర మంత్రి దిష్టిబొమ్మల దహనం.. నిరసన ర్యాలీలు

ఢిల్లీ లొల్లికి గల్లీల్లో మద్దతు...పలుచోట్ల కేంద్ర మంత్రి దిష్టిబొమ్మల దహనం.. నిరసన ర్యాలీలు

సిటీ నెట్​వర్క్,​ వెలుగు: నీట్​పేపర్​లీకేజీని నిరసిస్తూ ఢిల్లీలో చేస్తున్న ఆందోళనకారులపై పోలీసుల లాఠీఛార్జీని నిరసిస్తూ లెఫ్ట్ పార్టీలు, విద్యార్థి, మహిళా సంఘాలు, ట్రాన్స్​జెండర్స్, అలాగే, కాంగ్రెస్​అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్టులకు వ్యతిరేకంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిరసనలు వెల్లువెత్తాయి. సీజేపీకి మద్దతు పలుకుతూ.. పలుచోట్ల కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పేపర్​లీకేజీకి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్​చేశారు. 

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్​ఆధ్వర్యంలో పికెట్ అంబేద్కర్​విగ్రహం నుంచి కార్ఖానాలోని అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.  రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చౌరస్తాలో షాద్​నగర్​ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో , కేశంపేటలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనుమగళ్ల రమేశ్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన తెలిపారు. విద్యానగర్ లో అనంతయ్య అధ్యక్షతన చేపట్టిన ఆందోళనలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, బాలయ్య పాల్గొన్నారు. యూత్​కాంగ్రెస్​ఆధ్వర్యంలో మల్కాజిగిరి చౌరస్తాలో ధర్నా చేసి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మ దహనం చేశారు.  కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేశ్​యాదవ్ ఆధ్వర్యంలో ఘట్​కేసర్​లోని శివారెడ్డిగూడ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.  

సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ ఆదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సీతాఫల్​మండి అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ విగ్రహం వరకు భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించారు.  అలాగే, కాంగ్రెస్​జిల్లా ప్రధాన కార్యదర్శి ర్యాల రాజేందర్ యాదవ్ ఆధ్వర్యంలో మెట్టుగూడలోనూ నిరసన ర్యాలీ తీశారు.  నెక్నాంపూర్, మణికొండ డివిజన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈఐపీఎల్​కార్నర్‌‌‌‌‌‌‌‌ స్టోన్ జంక్షన్ వద్ద ధర్నా చేశారు. నెక్నాంపూర్ డివిజన్ ప్రెసిడెంట్ జితేందర్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య, కాంగ్రెస్​లీడర్లు నిరసన తెలిపారు. వికారాబాద్ పార్టీ మండల అధ్యక్షుడు బిళ్లపాటి రాజశేఖర్ రెడ్డి, యువజన కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు సతీశ్​రెడ్డి పాల్గొన్నారు. పరిగిలో బస్టాండ్​ఎదుట ఎస్ఎఫ్ఐ ఆందోళన చేసింది.  సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ ఆదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సీతాఫల్​మండి అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ విగ్రహం వరకు భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్​జిల్లా ప్రధాన కార్యదర్శి ర్యాల రాజేందర్ యాదవ్ ఆధ్వర్యంలో మెట్టుగూడలోనూ నిరసన ర్యాలీ తీశారు.  

ప్రధాని ఇంటి ముందు ధర్నాలా.. సిగ్గు సిగ్గు 

హైకోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి ఎదుట ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ధర్నాను వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టుకు చెందిన పలువురు న్యాయవాదులు బార్ కౌన్సిల్ గేట్ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే అక్కడ చర్చించకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ఎదుట ఆందోళన చేయడాన్ని వారు తప్పుబట్టారు. ‘ప్రధాని ఇంటి ముందు ధర్నాలా? సిగ్గు సిగ్గు’ అని నినదించారు.