- ఏఐసీపీ ఖైరతాబాద్ అబ్జర్వర్ శక్తిసింగ్ గోయెలె
అంబర్ పేట, వెలుగు: కాంగ్రెస్ లో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకే పదవులు దక్కుతాయని ఏఐసీపీ ఖైరతాబాద్ అబ్జర్వర్ శక్తిసింగ్ గోయెలె అన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సంఘటన్ శ్రీజన్ అభియాన్ లో భాగంగా ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్ష ఎన్నిక కోసం ఏఐసీసీ అబ్జర్వర్‌గా శక్తిసింగ్ గోయలె, పీసీసీ అబ్జర్వర్లుగా ఎంపీ మల్లు రవి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్, నాగ సీతరాములును అధిష్టానం నియమించింది.
ఈ సందర్భంగా సోమవారం అంబర్ పేట నియోజకవర్గంలో కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు. అనంతరం స్థానిక ధృవ్ ఎలైట్ హోటల్లో జరిగిన సమావేశంలో శక్తిసింగ్ గోయెలె మాట్లాడారు. డీసీసీ అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయవచ్చన్నారు. ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా కార్యకర్తల అభీష్టం మేరకు పదవులు కట్టబెడుతామని స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్షుడు సి.రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.
కార్యకర్తల అభిప్రాయాలకే ప్రయార్టీ..
చేవెళ్ల: డీసీసీ అధ్యక్షుల ఎంపికలో కార్యకర్తల అభిప్రాయాలకే ప్రయార్టీ ఇస్తామని ఏఐసీసీ అబ్జర్వర్, ఎంపీ రాబర్ట్ బ్రూస్ అన్నారు. సోమవారం చేవెళ్లలో కార్యకర్తల అభిప్రాయ సేకరణ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల నుంచే నాయకుడిని ఎన్నుకోవాలనే ఉద్దేశ్యంతో అభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. దేశంలోని 600 పైచిలుకు జిల్లాల్లో కాంగ్రెస్ ఇదే విధానాన్ని అవలంభిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, పీసీసీ అబ్జర్వర్ కోమటిరెడ్డి వినయ్ రెడ్డి, విజయరెడ్డి, పొల్యూషన్బోర్డు మెంబర్చింపుల సత్యనారాయణ
తదితరులు పాల్గొన్నారు.
నిఖార్సైన కార్యకర్తలకే..
వికారాబాద్: కాంగ్రెస్ జెండా మోసిన నిఖార్సైన కార్యకర్తలు పార్టీలో పదవులు లభిస్తాయని ఏఐసీసీ వికారాబాద్ జిల్లా అబ్జర్వర్ సూరత్ సింగ్ ఠాగూర్ స్పష్టం చేశారు. సోమవారం వికారాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అహ్మదాబాద్ లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా సంఘటన్ సృజన్ అభియాన్ పేరిట కార్యకర్తల అభిప్రాయాలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
వారి అభీష్టం మేరకు డీసీసీ అధ్యక్షుల పేర్లను సేకరించి కేంద్ర నాయకత్వానికి నివేదికను పంపించనున్నట్లు తెలిపారు. డీసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులు ఈ నెల 16 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, టీపీసీసీ అబ్జర్వర్లు బెల్లయ్యనాయక్, నీలిమ, వేణు గౌడ్, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ పాల్గొన్నారు.
