అర్బన్ ఏరియాల్లో 18,213 ఇండ్లు..హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం వెల్లడి 

అర్బన్ ఏరియాల్లో 18,213 ఇండ్లు..హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన్ ( పీఎంఏవై అర్బన్)  కింద ఇండ్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ఒక్కో ఇంటిని రూ.5 లక్షల వ్యయంతో రాష్ట్రంలోని 118 పట్టణ ప్రాంతాల్లో  మొత్తం 18,213 ఇండ్లను నిర్మించాలన్న రాష్ర్ట  ప్రతిపాదనలను కేంద్రం తాజాగా ఆమోదించింది.

ఈ ఇండ్ల నిర్మాణానికి మొత్తం  రూ.910.65 కోట్లు ఖర్చు అవుతుండగా ఇందులో కేంద్రం వాటాగా రూ. 273.20 కోట్లు రిలీజ్ చేయనుందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం మంగళవారం పత్రిక ప్రకటనలో తెలిపారు. పీఎంఏవై (అర్బన్ )2.0 పథకం సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ ( సీఎస్ఎంసీ) ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్టు ఆయన ప్రకటించారు.