మున్సి పోల్స్ లో కాంగ్రెస్ కు 39.8% ఓట్లు

మున్సి పోల్స్ లో  కాంగ్రెస్ కు 39.8%  ఓట్లు
  • గెలిచిన సీట్లు 51%.. రెండు, మూడు స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ
  •     ఈ  ఎన్నికల్లో మొత్తం 37.81 లక్షల ఓట్లు పోలింగ్​
  •     2,995 వార్డుల ఫలితాలు వెల్లడించిన ఈసీ 

హైదరాబాద్, వెలుగు:  మున్సిపల్​ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 39.80 శాతం ఓట్లు సాధించింది. ఆ పార్టీకి చెందిన అభ్యర్థులకు 15 లక్షల 5 వేల 6 ఓట్లు పోలయ్యాయి.  రెండు, మూడు స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ నిలిచాయి. బీఆర్ఎస్​కు  10 లక్షల 87 వేల 347 ఓట్లు (28.75 శాతం) రాగా.. బీజేపీకి 5 లక్షల 92  వేల 823 ఓట్లు (15.67 శాతం) పోల్ అయ్యాయని శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక నాలుగో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. వీరికి 3 లక్షల 14 వేల 96 ఓట్లు (8.30 శాతం) వచ్చాయి. ఇక ఎంఐఎం పార్టీకి లక్షా 24 వేల 236 ఓట్లు (3.28 శాతం) పోలయ్యాయి. 

ఓట్లు 39 శాతం.. సీట్లు 51 శాతం

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్ర్టైక్ రేట్ పరిశీలిస్తే ఓట్లకు సీట్లకు మధ్య12 శాతం తేడా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో కలిపి 2,996 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. వీటిలో 14 స్థానాలు ఏకగ్రీవం కాగా ఒక చోట ఎన్నిక వాయిదా పడింది. దీంతో మిగిలిన 2,981 సీట్లకు ఈ నెల11న పోలింగ్ నిర్వహించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 37.81 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధికంగా1,537 స్థానాల్లో గెలిచారు. వార్డుల వారీగా పరిశీలిస్తే మొత్తం వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 51.31 శాతం సీట్లను గెలుచుకున్నట్లయ్యింది. ఓట్ల పరంగా పరిశీలిస్తే ఈ పార్టీకి వచ్చింది కేవలం 39.80 శాతం ఓట్లు మాత్రమే. అయినా ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే తొలిస్థానంలో నిలిచింది.

బీఆర్ఎస్, బీజేపీలకు ఓట్లు పెరిగినా తగ్గిన సీట్లు

బీఆర్ఎస్, బీజేపీలకు వచ్చిన ఓట్లు, సీట్ల శాతాన్ని పరిశీలిస్తే కొద్ది తేడా కన్పిస్తోంది. బీఆర్ఎస్ కు 28.75 శాతం ఓట్లు పడగా సీట్లు మాత్రం 781(26.07 శాతం) వచ్చాయి. బీజేపీకి 15.67 శాతం ఓట్లు పోలవ్వగా 336 సీట్లు మాత్రమే (11.21 శాతం) వచ్చాయి. అలాగే ఎంఐఎం పార్టీకి 3.28 శాతం ఓట్లు రాగా 70 సీట్లు.. ఇండిపెండెంట్లకు 8.30 శాతం ఓట్లు పడగా183 సీట్లు గెలిచారు. సీపీఎం పార్టీకి 0.58 శాతం ఓట్లు పడితే 13 సీట్లు గెలిచినట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.  

మున్సిపోల్స్ లో  పార్టీల వారీగా ఓట్లు, సీట్ల శాతాలు..  

పార్టీ పేరు     వచ్చిన ఓట్లు      శాతం       గెలిచిన సీట్లు     శాతం
కాంగ్రెస్​         15,05,006           39.80%          1,537               51.31%
బీఆర్​ఎస్​      10,87,347            28.75%           781                26.07%
బీజేపీ             5,92,823              15.67%            336              11.21%