మేమొస్తే ఎంఎస్‌‌పీకి చట్టబద్ధత: ఖర్గే

మేమొస్తే ఎంఎస్‌‌పీకి చట్టబద్ధత: ఖర్గే

అంబికాపూర్: కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌‌పీ)కు చట్టబద్ధత కల్పిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హామీ ఇచ్చారు. రైతుల ‘ఢిల్లీ చలో’ ఆందోళనల మధ్య ఖర్గే ఈ ప్రకటన చేశారు. చత్తీస్‌‌గఢ్‌‌లోని అంబికాపూర్ జిల్లాలో కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్రలో మంగళవారం ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్‌‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల ప్రయోజనాల కోసం ఎంఎస్‌‌పీకి చట్టబద్ధమైన హామీని ఇస్తుందని, ఎన్నికలకు ముందు తమ పార్టీ ఇచ్చిన తొలి హామీ ఇదేనని ఖర్గే పేర్కొన్నారు.