ఫ్రీ స్కూటీ, నెలకు రూ. 4 వేల డబ్బులు.. 

ఫ్రీ స్కూటీ, నెలకు రూ. 4 వేల డబ్బులు.. 

తెలంగాణ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉండగానే.. రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ ముందుగానే యువతకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. తెలంగాణలో అధికారంలోకి తామోస్తే ఏం చేస్తామో ప్రకటించింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ‘యువ సంఘర్షణ సభ’ పేరిట కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో “హైదరాబాద్ యూత్ డిక్లరేషన్" ప్రకటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 

మహిళా సాధికారతపై ప్రత్యేక ఫోకస్ చేసిన కాంగ్రెస్.. చదువుకునే యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందిస్తామని బహిరంగ వేదికగా ప్రకటించారు. ముఖ్యంగా 18 సంవత్సరాలుపై బడి, చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ల అందజేస్తామని హామీ ఇచ్చారు. 

కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ సంచలనంగా మారింది. ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ ఆఫర్స్ చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా 18 ఏళ్లు పైబడిన ప్రతీ యువతికి ఉచితంగా స్కూటీ ఇస్తామని ప్రకటించటం సంచలనంగా మారింది. యువతులకు అయితే ఫ్రీ స్కూటీలు ఇస్తున్నారు.. యువతకు కుర్రోళ్లకు ఏంటీ అంటారా.. ఉద్యోగం వచ్చే వరకు.. ఉపాధి కల్పించే వరకు ప్రతి నెలా 4 వేల రూపాయలు ఇస్తామంటున్నారు రేవంత్ రెడ్డి.

ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. తెలంగాణలో యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని.. వచ్చిన వెంటనే యువత కోసం అమలు చేయబోయే పథకాలను డిక్లరేషన్ రూపంలో ప్రకటించారు. 

కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ లోని ముఖ్యాంశాలు ఇవే..

* ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు ప్రతి నెలా రూ.25 వేల పెన్షన్
* కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన  మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాల భర్తీ
* ప్రతి నిరుద్యోగికి నెలకు 4 వేల రూపాయల భ్రుతి
* ప్రభుత్వం నుంచి రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగ అవకాశాలు
* నిరుద్యోగ యువతకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం అందజేత
* తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
* ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్
* ప్రతి ఏటా సెప్టెంబర్ 17వ తేదీన ఉద్యోగ నియామక పత్రాలు అందజేత
* అమరవీరులు, ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు