నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ పదవుల ఎంపిక పూర్తయింది. సోమవారం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్మూడు, మజ్లిస్రెండు స్థానాలు గెలుచుకుంది. జనరల్కోటాకు రిజర్వ్ చేసిన స్థానాల్లో కాంగ్రెస్‌నుంచి బీసీ వర్గానికి చెందిన బొబ్బిలి మాధురి, కల్లెడ అశోక్ విజయం సాధించగా.. మజ్లిస్ నుంచి ముజీబ్అహ్మద్ గెలిచారు.
మైనార్టీ కోటాకు రిజర్వ్ చేసిన రెండు సీట్లలో సిక్కు వర్గానికి చెందిన సర్దార్నరేందర్సింగ్కాంగ్రెస్ నుంచి, మజ్లిస్ నుంచి ఉజ్మా గెలుపొందారు. కోఆప్షన్ పదవులతో కార్పొరేషన్లో కాంగ్రెస్, మజ్లిస్ బలం మరింత పెరిగింది. పదవులు పొందిన వారిలో బొబ్బిలి మాధురి గతంలో కార్పొరేటర్‌గా పనిచేశారు. నరేందర్సింగ్రెండోసారి కోఆప్షన్పదవి దక్కించుకోగా రూరల్ సెగ్మెంట్పరిధి నుంచి అశోక్ ఎన్నికయ్యారు.
మజ్లిస్ పార్టీ నగర జనరల్ సెక్రటరీ ముజీబ్ అహ్మద్ రెండోసారి కోఆప్షన్పదవి పొందగా ఫిబ్రవరిలో జరిగిన కార్పొరేషన్ఎన్నికల్లో టికెట్‌దక్కని బాడీ బిల్డర్ అజ్వత్ ఖాన్భార్య ఉజ్మాకు కోఆప్షన్పదవి ఇచ్చారు. మేయర్ఉమారాణి అధ్యక్షతన ఏర్పాటైన ప్రత్యేక సమావేశానికి ఎక్స్అఫీషియో సభ్యుల హోదాలో ఎమ్మెల్సీ, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, రూరల్ఎమ్మెల్యే భూపతిరెడ్డి హాజరయ్యారు. కార్పొరేషన్లో 28 మంది కార్పొరేటర్లున్న బీజేపీ కోఆప్షన్ ఎన్నికలకు హాజరు కాలేదు.
