
హైదరాబాద్,వెలుగు: మూడో పెళ్లి చేసుకున్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ను రెండో భార్య కంప్లయింట్ తో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సహారా ఎస్టేట్లో ఉండే యడ్ల శంకరయ్య(39) సీఆర్పీఎఫ్ కాస్టేబుల్ 2011లోపెళ్లి చేసుకొని కొద్ది రోజులకే డైవర్స్ ఇచ్చాడు. 2016లో ఆయుర్వేదిక్ డాక్టర్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు . వారికి ఓ పాప పుట్టింది. వనస్థలిపురంలో బ్యూటీ పార్లర్ నిర్వహించే మరో మహిళతో ఫేస్ బుక్ లో పరిచయమవగా, 2019 నవంబర్లో తిరుపతిలో ఆమెను మూడోపెళ్లి చేసుకున్నాడు.విషయం తెలుసుకున్న రెండో భార్య ప్రశ్నించడంతో ఆమెను బెదిరిస్తున్నాడు. దాంతో గురువారం ఆమె వనస్థలిపురం పీఎస్లో కంప్లయింట్ చేయడంతో పోలీసులు కేసు ఫైల్ చేసి శంకరయ్యను అరెస్ట్ చేశారు.