
6,03,955 మంది హాజరు..
57,243 మంది ఆబ్సెంట్
హైదరాబాద్, వెలుగు : కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,601 సెంటర్లలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. హైదరాబాద్ లోని 3 కమిషనరేట్లతో పాటు జిల్లాల యూనిట్స్ లో సెంటర్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 6,61,198 మంది అభ్యర్థులు పరీక్షకు అప్లై చేసుకోగా 6,03,955 మంది హాజరయ్యారు. ఆలస్యంగా రావడం వివిధ కారణాలతో 57,243 మంది ఆబ్సెంట్ అయ్యారు. నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను అనుమతించలేదు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో 10 మంది అభ్యర్థులు 2 నుంచి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చి వెనుదిరిగారు. 15,644 సివిల్, ఏఆర్ కానిస్టేబుల్, 614 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్, 63 ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్స్ పోస్టుల్లో ఒక్కో పోస్ట్ కోసం 40 మంది వరకు పోటీ పడుతున్నారు. కాగా, 200 ప్రశ్నలతో ఇచ్చిన ప్రిలిమినరీ పరీక్ష పేపర్లో నాలుగు ప్రశ్నల్లో తప్పులు వచ్చాయి. రెండు రోజుల్లో కీ విడుదల చేస్తామని రిక్రూట్ మెంట్ బోర్డ్ చైర్మన్ వీవీ శ్రీనివాస్ రావు చెప్పారు.