
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ లోని ఆరంఘర్ చౌరస్తా బస్సు స్టాప్ లో అకస్మాత్తుగా పడిపోయిన ఓ యువకుడిని కానిస్టేబుల్ కాపాడారు. యువకుడు ఒక్కసారిగా కుప్పకూలడంతో.. అక్కడే విధులు నిర్వర్తిస్తోన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్.. వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చారు. కదలలేని స్థితిలో ఉన్న యువకుడికి కానిస్టేబుల్ సీపీఆర్ చేసి, అతని ప్రాణాలు కాపాడారు. అనంతరం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.