2024 తర్వాత రాజ్యాంగ విలువలు ఉంటాయా? : ప్రొఫెసర్ హరగోపాల్

2024 తర్వాత   రాజ్యాంగ విలువలు ఉంటాయా? : ప్రొఫెసర్ హరగోపాల్

 ఖైరతాబాద్​, వెలుగు : రాజకీయ వ్యవస్థల కారణంగా 2024  తర్వాత రాజ్యాంగ విలువలు ఉంటాయా..?  లేవా? అనే భయానక పరిస్థితి నెలకొందని  ప్రొఫెసర్ హరగోపాల్ ​ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ పౌర సమాజ ప్రతినిధులు జనగణమన అభియాన్ ​ప్రచార పోస్టర్​ను బుధవారం సోమాజిగూడ  ప్రెస్​క్లబ్​లో ఆవిష్కరించగా.. హరగోపాల్ చీఫ్​గెస్టుగా హాజరై మాట్లాడారు. దేశంలో రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం, మత సామరస్యాన్ని రక్షించడం లక్ష్యంగా ఫోన్ నంబర్ ​95870 40 998కు మిస్డ్​కాల్ ఇవ్వాలని పిలుపునిచ్చారు.

75 ఏళ్ల తర్వాత రాజ్యాంగం నుంచి చాలా దూరం వెళ్లిపోయామన్నారు.  ప్రస్తుతం స్వేచ్ఛగా ఉండే వెసులుబాటు లేకుండా పోయిందన్నారు.  దీనిపై చైతన్యం తీసుకొచ్చేందుకు పౌర సమాజం నుంచి సంతకాల సేకరణను తమ వంతు బాధ్యతగా చేపట్టాలని సూచించారు. భారత్​ జోడో అభియాన్​ ద్వారా జనవరి1 నుంచి 31 వరకు నెలరోజులు ప్రచారానికి దేశవ్యాప్త పిలుపునిచ్చినట్లు చెప్పారు.  దేశంలో పెరిగిపోతున్న మతపరమైన, ద్వేష పూరిత రాజకీయాలు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి  ముప్పుగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేశారు.  

సమావేశంలో ప్రొఫెసర్​ రమా మెల్కొటే, ఆర్​.వెంకటరెడ్డి, కన్నె గంటి రవి, భారత్​ జోడో అభియాన్​కు చెందిన జాహిద్​ ఖాద్రి, కిరణ్​కుమార్​ విస్సా, ముస్లిం సంఘాల జేఏసీ  ప్రతినిధులు సలీం పాషా, ఓబీసీ స్టూడెంట్స్ ​యూనియన్, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ అఖిల భారత కమిటీ ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు.