నిర్మాణ కార్మికులకు నష్ట పరిహారం

నిర్మాణ కార్మికులకు నష్ట పరిహారం

దాదాపు మూడు వారాలుగా దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం తీవ్రంగా వేధిస్తోంది. దీపావళి నాటి నుంచి ఎయిర్ క్వాలిటీ ఘోరంగా పడిపోయింది. ఇవాళ కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 339గా నమోదైంది. కాలుష్యానికి తోడు.. పొగమంచు వాహనదారులను తీవ్ర ఇబ్బంది పెడుతోంది. గాలినాణ్యత మెరుగుపడే వరకు కఠిన ఆంక్షలు అమలుచేయాలని సర్కార్ నిర్ణయించింది. అయితే గతంలో పోలిస్తే కొంత మేర కాలుష్యం తగ్గడంతో ప్రభుత్వం కొన్ని ఆంక్షలను సడలిస్తోంది.. ముఖ్యంగా ఈనెల 29 నుంచి స్కూళ్లు తెరవాలని కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయించింది. డిసెంబర్ 3 వరకు ఢిల్లీలోకి ఎలాంటి వాహనాలను రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.

మరోవైపు ఢిల్లీలో పొల్యూషన్‌ను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం నిర్మాణ పనులను నిషేధించింది. దీంతో నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు 5 వేల రూపాయల చొప్పున  సాయం అందించేందుకు ఆర్డర్స్ ఇచ్చినట్టు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు. కార్మికులకు పరిహారం కూడా అందిస్తామని ప్రకటించారు. నిర్మాణ కార్మికులకు వారి కనీస వేతనాల ఆధారంగా ఈ నష్ట పరిహారం అందిస్తామన్నారు.