
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డబల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం నాసీరకంగా సాగుతోంది. పట్టించుకునేవారు లేక… ఇళ్ల నిర్మాణం అస్థవ్యస్తంగా చేస్తున్నారని మండిపడుతున్నారు లబ్ధిదారులు. రెండు రోజులుగా కురుస్తున్న వానలకు పాల్వంచ మండలం దంతెల్లబోర పంచాయతీలో నిర్మాణంలో ఉన్న ఇళ్ల గోడలు కూలడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాసీరకం మెటీరియల్ తో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని… కట్టిన కొన్నిరోజులకే బీటలు వస్తున్నాయని చెబుతున్నారు. కాసుల కక్కుర్తితో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా ఇళ్ల నిర్మాణం చేస్తున్నారని వాపోయారు. దాదాపు 20 ఇళ్లు… నిర్మాణాలు పూర్తికాకముందే కూలడంపై విచారణ జరిపి.. కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.