సీఎం కేసీఆర్ విజ్ఞప్తిని తెలంగాణ రైతాంగం స్వాగతించింది

సీఎం కేసీఆర్ విజ్ఞప్తిని తెలంగాణ రైతాంగం స్వాగతించింది

నారాయణపేట్ జిల్లా : రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడటం ఆనందించాల్సిన అంశం అన్నారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి. ఆదివారం నారాయ‌ణపేట్ జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో రూ. 75 లక్షల వ్యయంతో ఆధునిక రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన నిరంజ‌న్ రెడ్డి..నారాయణపేట నియోజకవర్గంలో వర్షాలు బాగా ప‌డ్డాయ‌న్నారు. కోయిల సాగర్ కూడా మొదటి 14రోజులు జూరాల నుండి నీరు తీసుకొని రావటం జరిగిందని.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా సాగుబాట పట్టార‌న్నారు. అప్పట్లో తెలంగాణలో వ్యవసాయం చేయలటే ఒక శాపంగా ఉండేదని.. మన రాష్ట్రం సాధించిన తర్వాత అందరికి ఆనందదాయకంగా ఉందన్నారు మంత్రి. సీఎం కేసీఆర్ సూచించిన నియంత్రిత సాగువిధానం దేశానికే దిక్సూచి అన్నారు మంత్రి నిరంజ‌న్ రెడ్డి.

తెలంగాణలో ఆరేండ్ల పాలనతో వ్యవసాయం లాభసాటి చేశామన్నారు మంత్రి నిరంజ‌న్ రెడ్డి. కరోనా కష్టకాలంలో ఈ దేశాన్ని ఆదుకున్నది వ్యవసాయరంగమేనని.. తెలంగాణలో వ్యవసాయ అనుకూల విధానాలతో సాగుకు రైతుల మొగ్గు చూపుతున్నరని తెలిపారు. ఈ రోజు వరకు రాష్ట్రంలో కోటి 35 లక్షల ఎకరాల్లో అన్ని పంటలు సాగుచేశారని.. మరో నాలుగు లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందన్నారు. 47 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. దాదాపు 11 లక్షల ఎకరాల్లో కంది సాగుచేసినట్లు చెప్పారు. మొక్కజొన్న సాగుచేయొద్దన్న కేసీఆర్ విజ్ఞప్తిని తెలంగాణ రైతాంగం స్వాగతించిందన్నారు మంత్రి నిరంజ‌న్ రెడ్డి.