పూణేలో ల్యాండ్ డీల్ వివాదంలో బిగ్ ట్విస్ట్.. ఆ డీల్ రద్దుచేశాం.. అజిత్ పవార్ సంచలన ప్రకటన

పూణేలో ల్యాండ్  డీల్ వివాదంలో బిగ్  ట్విస్ట్.. ఆ డీల్ రద్దుచేశాం.. అజిత్  పవార్ సంచలన ప్రకటన

పూణేలో ల్యాండ్ డీల్ వివాదంలో బిగ్​ ట్విస్ట్.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్​ పవార్​ కొడుకు పార్థ్​ పవార్​ ల్యాండ్​ డీల్​ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహర్​ వతన్​ భూ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించారు. దాదాపు 1800 కోట్ల విలువైన భూములను నామమాత్రపు ధరకు పార్థ్​ పవార్​ కంపెనీ అమేడియా ఎంటర్ ప్రైజెస్​ కు కట్టబెట్టారని ఆరోపణలు ఉన్న క్రమంలో అజిత్ పవార్​ ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు శుక్రవారం(నవంబర్​7)  చెప్పారు.

ఫూణే ల్యాండ్​ డీల్​ వివాదం.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్​ పవార్​ కు తలనొప్పిగా మారింది. గురువారం ఈ భారీ ల్యాండ్​ డీల్​అక్రమంగా జరిగిందని ఆరోపణలు రావడంతో మొదట సమర్థించుకున్నారు. అయితే 24 గంటల్లో వివాదం ముదిరి దేశ వ్యాప్తంగా కలకలం రేపడంతో భూలావాదేవీలను రద్దు చేస్తామని.. నెలలోగా ఈ వివాదం ముగుస్తుందన్నారు అజిత్​ పవార్. 

విలేకరులతో మాట్లాడిన అజిత్​ పవార్​.. ఈ ల్యాండ్​ లావాదేవీలను రద్ద చేశాం.. ఈ వివాదానికి సంబంధించిన విచారణ కమిటీని వేశాం.. కమిటీ దర్యాప్తులో మొత్తం విషయం బయటపడుతుంది. ఎవరు సాయం చేశారు. ఎవరికి ఫోన్లు చేశారు అన్నీ వెలుగులోకి వస్తాయి.. తప్పు చేస్తే నా సొంత వారైన సహించం అని  అజిత్​ పవార్​ అన్నారు. 

ఏం జరిగింది.. ?

పూణేలో దాదాపు రూ.1800 కోట్ల విలువైన 40 ఎకరాల భూమిని పార్థ్ పవార్ కంపెనీకి దాదాపు రూ.300 కోట్లకు అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఒప్పందంపై చెల్లించిన స్టాంప్ డ్యూటీ రూ.500 మాత్రమే కావడం చాలా మందిని మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వివాదం రాజకీయంగా తీవ్ర కలకలం రేపడంతో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ కూడా చర్యలకు ఆదేశించారు. ఈ వివాదంలో ఫుణె ఎమ్మార్వో సూర్యకాంత్​ యోవాలెను సస్పెండ్ చేశారు. అదనపు సీఎస్​ వికాస్​ ఖర్గే అధ్యక్షతన విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తప్పు జరిగిందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామనిఅన్నారు. 

స్టాంపులు ,రిజిస్ట్రేషన్ శాఖ ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. భూమి లావాదేవీ పూర్తిగా చట్టవిరుద్ధంగా జరిగినట్లు తెలుస్తోంతి. వాస్తవ ఆస్తి ధరను చాలా తక్కువగా అంచనా వేసిన కేవలం రూ. 500 స్టాంప్ పేపర్‌పై అమ్మకం జరిగిందని దర్యాప్తులో తేలింది. ఈ వివాదం తర్వాత పూణే డిప్యూటీ రిజిస్ట్రార్ రవీంద్ర తరును కూడా సస్పెండ్ చేశారు. లావాదేవీని చట్టవిరుద్ధంగా నమోదు చేశారని, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించారని అసలు భూ యజమానికి,రాష్ట్ర ఖజానాకు నష్టాన్ని కలిగించారని పార్థ పవార్​ పై ఆరోపణలు చేశారు.

వివాదంలో ఉన్న భూమి పూణేలోని కోరెగావ్ పార్క్‌లో ఉంది..ఇది నగరంలోని అత్యంత విలువైన,హైలెవెల్​ప్రాంతాలలో ఒకటి. ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలు ఉల్లంఘించి లావాదేవీలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. ట్యాక్స్​,స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టేందుకు ఆస్తిని విలువ తక్కువ అంచనా వేయడానికి బిగ్​ ల్యాండ్​ డీల్​ జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.