అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichandar).. ప్రస్తుతం సోషల్ మీడియాలో మొత్తం ఇదే పేరు ట్రెండ్ అవుతోంది. తన ఎలక్ట్రిఫయింగ్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ.. ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాడు. మనిషి చూడటానికి సన్నగా ఉంటాడు కానీ.. ఒక్కసారి మ్యూజిక్ ఇస్స్తే అంతే.. స్పీకర్లు పగిలిపోవడం ఖాయం. ఇక తాజాగా రజనీకాంత్(Rajinikanth) జైలర్(Jailer) సినిమాకు అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.
ఈ సినిమా తరువాత అనిరుధ్ నుండి వస్తున్న మరో భారీ సినిమా జవాన్(Jawan). బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah rukh khan) హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాను కూడా అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుండి తాజాగా చెలియా అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ పాటకు ఆడియన్స్ నుండి నెగిటీవ్ టాక్ వస్తోంది. ఈ పాట కాపీ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్(Pawan kalyan) హీరోగా వచ్చిన అజ్ఞాతవాసి(Aganathavasi) సినిమాలోని, గాలి వాలుగా(Gali valuga), ఏబీ ఎవరో నీ బేబీ(AB evaro ne baby) అనే పాటలు కలిపి చేసినట్టుగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అంతేకాదు ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుండి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీస్ అన్నిటికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. అలాంటి అనిరుధ్ ఇలాంటి సమయంలో ఇలా కాపీ మ్యూజిక్ ఇవ్వడం ఏంటి అని కంగారు పడుతున్నారు స్టార్ హీరోల ఫ్యాన్స్. ప్రస్తుతం అనిరుధ్ మ్యూజిక్ పై చాలా అంచనాలు ఏర్పడుతున్నాయి. ఆయన మ్యూజిక్ ఇస్తే చాలు సినిమా హిట్ అనే స్థాయికి వచ్చేసింది. అలాంటి టైం ఇలా డిజప్పాయింటెడ్ మ్యూజిక్ ఇచ్చి ఫ్యాన్స్ కు షాకిస్తున్నాడు అనిరుద్. మరి తరువాత సినిమాలకైనా ఆకట్టుకునే మ్యూజిక్ ఇస్తాడా అనేది చూడాలి.