ఫిర్యాదు చేసిన వృద్ధురాలి ఇంటికే ఎఫ్ఐఆర్ కాపీ.. ఫ్రెండ్లీ పోలీసింగ్లో బాలానగర్ పోలీసులు

ఫిర్యాదు చేసిన వృద్ధురాలి ఇంటికే ఎఫ్ఐఆర్ కాపీ..  ఫ్రెండ్లీ పోలీసింగ్లో బాలానగర్ పోలీసులు

కూకట్​పల్లి, వెలుగు: ఫ్రెండ్లీ పోలీసింగ్​లో భాగంగా బాలానగర్​ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వృద్ధులు, దివ్యాంగులు ఇచ్చిన ఫిర్యాదులపై ఎఫ్​ఐఆర్​ చేసి వారి ఇంటికే తీసుకువెళ్లి ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 65 ఏండ్ల వృద్ధురాలు సరికొండ భ్రమరాంబ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

  సోమవారం బాలానగర్​ ఇన్​స్పెక్టర్​ నరసింహారాజు స్వయంగా సిబ్బందితో ఆమె ఇంటికి వెళ్లి ఎఫ్​ఐఆర్​ కాపీని అందజేశారు. ఈ పరిణామంపై బాధితురాలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇన్​స్పెక్టర్​ నరసింహారాజు మాట్లాడుతూ సైబరాబాద్​ సీపీ అవినాష్​మహంతి సూచనలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. సున్నితమైన కేసుల్లో సివిల్​ డ్రెస్సుల్లో వెళ్లి ఎఫ్​ఐఆర్​ కాపీలను అందించనున్నట్లు వివరించారు.