
పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని బోయినిపేటలో 60 మంది పోలీసు బలగాలతో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తనిఖీ చేసి ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి అనుమానితుల పై ఆరా తీశారు. ఈ కార్డెన్ సెర్చ్ లో ఎలాంటి దృవపత్రాలు లేని 56 ద్విచక్ర వాహనాలను, రెండు ఆటోలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా మంథని సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జూలై 2 2024 ఉదయం బోయినిపేటలో కార్డెన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. గ్రామాల్లో ఆసాంఘిక శక్తులు ఎవరైనా ఉన్నారా అని తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు.