ఈ నెల 20 నుంచి వ్యవసాయం చేసుకోవచ్చు

ఈ నెల 20 నుంచి వ్యవసాయం చేసుకోవచ్చు
  • ఐటీ, ఈకామర్స్, ఇంటర్​స్టేట్​ ట్రాన్స్​పోర్ట్​కు కూడా ఓకే
  • కరోనా ఎఫెక్ట్​ లేని ప్రాంతాలకు మాత్రమే పరిమితం
  • గైడ్​లైన్స్​ను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 20 నుంచి వ్యవసాయం, ఐటీ, ఈకామర్స్, ఇంటర్​ స్టేట్​ ట్రాన్స్​పోర్ట్​కు అనుమతి ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా ఎఫెక్ట్​ లేని ప్రాంతాల్లో వ్యవసాయ కార్యకలాపాలు, గుర్తించిన మార్కెట్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకం చేసేందుకు అనుమతి ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ బుధవారం గైడ్​ లైన్స్​ ను రిలీజ్​ చేసింది. పబ్లిక్​ ప్లేసులు, పని ప్రదేశాల్లో ఫేస్​ మాస్క్​లు పెట్టుకోవడం తప్పనిసరి అని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం శిక్షార్షమైన నేరమని స్పష్టం చేసింది. వీటిని అందరూ తప్పకుండా పాటించాలని, జిల్లా కలెక్టర్లు ఈ గైడ్ లైన్స్​ సక్రమంగా అమలయ్యేలా చూడాలని సూచించింది. ఈ గైడ్​ లైన్స్​ పాటించని వారికి డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ యాక్ట్​ 2005 ప్రకారం ఫైన్లు, శిక్షలు విధించాలని ఆదేశించింది. ఈ నెల 20 నుంచి కరోనా ఎఫెక్ట్​ లేని కొన్ని ప్రాంతాలకు లాక్​డౌన్​ నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్టు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.