భక్తులు లేకుండానే సీతారాముల కల్యాణం: పువ్వాడ

భక్తులు లేకుండానే సీతారాముల కల్యాణం: పువ్వాడ

కరోనా ఎఫెక్ట్ భద్రాద్రి రామయ్యపై కూడా పడింది. దీంతో అలర్టైన ఆలయాధికారులు శ్రీరామనవమికి భక్తులను అనుమతించడం లేదు. ఈ ఏడాది భక్తులు లేకుండానే శ్రీరామనవమి వేడుకలు జరగనున్నట్లు తెలిపారు మంత్రి పువ్వాడ అజయ్‌. ఏప్రిల్‌ 2న జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏటా వైభవంగా నిర్వహించే ఈ కల్యాణం ఈసారి భక్తులు లేకుండానే  నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేకాదు భక్తులు తీసుకున్న కల్యాణం టికెట్లు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. వారికి టికెట్‌ డబ్బులు తిరిగి ఆలయ అధికారులు చెల్లిస్తారన్నారు మంత్రి పువ్వాడ అజయ్.

కరోనాపై ప్రజలు భయాందోళన చెందవద్దన్న మంత్రి అజయ్ … ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.