Zee5 Telugu Web Series: జీ5 ఓటీటీలో ఆడియన్స్ ఎక్కువగా చూసిన తెలుగు క్రైమ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే

Zee5 Telugu Web Series: జీ5 ఓటీటీలో ఆడియన్స్ ఎక్కువగా చూసిన తెలుగు క్రైమ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే

ప్రస్తుతం ఓటీటీలు, వెబ్ సిరీస్‌ల యుగం నడుస్తోంది. అందులో చాలా రకాలైన సినిమాలు, సిరీస్ లు వస్తూనే ఉంటాయి. అందులో భాగంగా ఇప్పటి వరకు ZEE5 ప్రేక్షకులకు ఎన్నో అద్భుతమైన వెబ్ సిరీస్ లను అందించింది. ముఖ్యంగా తెలుగులోనూ చెప్పుకోదగిన సిరీస్ లు ఎన్నో వచ్చాయి. వాటిలో కొన్ని సినిమాలకు మించి అదిరిపోయే థ్రిల్ పంచాయి. మరి థ్రిల్లింగ్, క్రైమ్ సిరీస్ ఏంటనేవి తెలుసుకుందాం. 

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి వచ్చిన కామెడీ డ్రామా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, అన్నపూర్ణ స్టూడియోస్ స్టేబుల్ నుండి ‘లూజర్ 2’, BBC స్టూడియోస్ అలాగే నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నుండి ‘గాలివాన’. అలాగే ‘రెక్కీ’ కూడా ఎంతో సూపర్ హిట్ అయ్యి వీక్షకుల మనసులు గెలుచుకుంది. సుశాంత్ OTT అరంగేట్రం చేసిన 'మా నీళ్ల ట్యాంక్'..ఇలా చాలా సిరీస్ లు ఉన్నాయి. అవేంటో లుక్కేద్దాం. 

జీ5 ఓటీటీలోని టాప్ వెబ్ సిరీస్లు 

గాలివాన 

జీ5లో ఉన్న ఇంట్రెస్టింగ్ క్రైమ్, థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ లో గాలివాన కూడా ఒకటి. ఇందులో డైలాగ్ కింగ్ సాయి కుమార్, రాధికా శరత్ కుమార్, చాందినీ చౌదరి నటించారు. ఈ వెబ్ సిరీస్..ప్రముఖ బ్రిటీష్ సిరీస్ 'వన్ ఆఫ్ అజ్' ఆధారంగా తెరకెక్కింది. ఇక సిరీస్ కథ విషయానికి వస్తే..ఓకే ఊళ్లోని ఓ బ్యూటిఫుల్ ఫ్యామిలీ హ్యాపీ గా గడుపుతుంటది. సడెన్ గా ఈ ఫ్యామిలీలో అలజడి మొదలవుతుంది.అంతేకాకుండా ఈ స్టోరీ ఓ దారుణమైన హత్య చుట్టూ తిరిగే ఈ క్రైమ్ డ్రామా అని చెప్పొచ్చు.ఇందులోని ఆసక్తికరమైన ట్విస్టులతో సాగిపోతుంది. శరన్ కోపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. 

షూటౌట్ ఎట్ ఆలేరు:

చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మించిన వెబ్ సిరీస్ ‘షూటౌట్ ఎట్ ఆలేరు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నందిని రాయ్, నిహారిక ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్‌కు ఆనంద్ రంగా దర్శకత్వం వహించారు. 

2015 ఏప్రిల్ 7న ఆలేరులో జరిగిన ఓ ఎన్‌కౌంటర్ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ సీరిస్ వాస్తవ ఘటనలకు కాస్త కల్పిత కథను జతచేసి ఉగ్రవాదం నేపథ్యంలో ఈ కాప్ డ్రామాను 8 ఎపిసోడ్స్‌‌గా రూపొందించారు. 


పులి మేక

ఆది, లావాణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన పులి మేక వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌కు మంచి ఆదరణ లభించింది. జీ 5, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ క‌లిసి రూపొందించిన పులి మేక ఒరిజిన‌ల్‌లో 8 ఎపిసోడ్స్ థ్రిల్ ఇస్తాయి. 

ఏటీఎం

ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కథ అందించిన వెబ్ సిరీస్ 'ఏటీఎం' (ATM) ఆయన కథకు తోడు 'దిల్' రాజు ప్రొడక్షన్స్ నిర్మించడంతో సిరీస్ మీద ప్రేక్షకుల చూపు పడింది. 'జీ5' ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్ లో బిగ్ బాస్ ఫేమ్ వీజే సన్నీ నటించాడు. ఓ నేరానికి పాల్పడిన స్నేహితుల బృందం తర్వాత దాని నుంచి ఎలా బయటపడిందన్నదే ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ లో చాలా చక్కగా చూపించారు.

శ్రీరామ్, శివ బాలాజీ, 'ఆడు కాలమ్‌' నరేన్, ధన్యా బాలకృష్ణ, ఎస్తేర్‌ నోరోన్హా, సమ్మెట గాంధీ నటించిన ఈ వెబ్‌ సిరీస్‌కు పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు.  1992లో తాడిపత్రిలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. తండ్రినే చంపాలనుకునే ఓ కొడుకు కథే ఈ రెక్కీ. 7 ఎపిసోడ్ల ఈ వెబ్ సిరీస్ కూడా జీ5 ఓటీటీలో ఉన్న టాప్ వెబ్ సిరీస్ లో ఇదొకటి. 

ఇవే కాకుండా..ఫ్యామిలీ, లవ్, మోటివేషనల్ వెబ్ సిరీస్ చాలానే జీ 5లో స్ట్రీమ్ అవుతున్నారు. ఇవి కేవలం క్రైమ్, థ్రిల్లింగ్ కథలతో వచ్చిన వెబ్ సీరిస్ మాత్రమే.