ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ ను గెలిపించాలి : కోదండరాం

ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ ను గెలిపించాలి : కోదండరాం

హైదరాబాద్: ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎమ్మెల్సీ  ఎన్నికల్లో పట్టభద్రులంతా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని తెలంగాణ జనససమితి అధినేత కోదండరాం కోరారు. ఇవాళ  నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీపీఐ, సీపీఎం, జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.   అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, బీఆరెస్ కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచామని చెప్పారు.  మార్పు కోసం అందరం కలిసి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని జనసమితి కార్యకర్తలకు కోదండరాం విజ్ఞప్తి చేశారు.