వాట్సాప్ లో కొత్త ఫీచర్..AI ప్రొఫైల్ ఫొటోలు క్రియేట్ చేసుకోవచ్చు

వాట్సాప్ లో కొత్త ఫీచర్..AI ప్రొఫైల్ ఫొటోలు క్రియేట్ చేసుకోవచ్చు

ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారులకోసం మరిన్ని ఫీచర్లను అందుబాటులో తెస్తోంది. Meta AI చాట్ బాట్ తో కలిసి AIజనరేటెడ్ ఫ్రొఫైల్ ఫొటోస్ ను క్రియేట్ చేసుకునేలా ఓ ఫీచర్ ను అందుబాటులోకి తెస్తోంది. ఈ కొత్త AI ఫీచర్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని చాలారకాల మార్పులు జరుగనున్నాయి. ఆండ్రాయిడ్ మొబైల్ లో కొంతమంది సెలక్టెడ్ బెటా టెస్టర్లను ఎంపిక చేసి AI జనరేటెడ్ ఫ్రొఫైల్ ఫొటోల ఫీచర్ ను  టెస్టింగ్ చేయనుంది. 

ఈ ఫీచర్ ఏ విధంగా పనిచేస్తుంది 

కొత్త AI ప్రారంభించిన ఫీచర్ తో గుర్తించిన బీటా వెర్షన్ వాట్సాప్ సెట్టింగ్ లలో క్రియేట్ AI ఫ్రొఫైల్ పిక్చర్  అనే కొత్త విభాగాన్ని చూపుతుంది. ఇందులో కొన్ని విషయాలు కొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. మనం ఇచ్చే కంటెంట్  ఆధారంగా పిక్చర్ ను AI ఫీచర్ ద్వారా పొందవచ్చు. ఫ్రొఫైల్ ఫొటోలను క్రియేట్ చేసేందుకు చాలా రకాల ఎంపికలు అందిస్తుంది. కస్టమర్లు వారి ఒరిజినల్ ఫొటోలకు బదులుగా ఆర్టిఫిషియల్ పిక్చర్స్ ను ఫ్రొఫైల్ ఫొటోలుగా వినియోగించడానికి ఇది ఒక మార్గం. 

వాట్సాప్‌లో అన్నీ AI

వాట్సాప్ ఇప్పటికే AI చాట్ బాట్ రూపంలో మెటా AI ని వినియోగిస్తోంది. దీని ద్వారా డైట్ ప్లాన్ సెటప్, కొత్త వంటకాలు చేయడానికి, ఇచ్చిన కంటెంట్  అర్థం చేసు కుని ప్రాంప్ట్ సహాయంతో ప్రశ్నలు, సమాధానాలు తెలుసుకోవడానికి ఈ చాట్ బాట్ ను వినియోగించుకోవచ్చు. 

వాట్సాప్ కస్టమర్ల సెక్యూరిటీకోసం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వారి ప్రొఫైల్ ఫొటోలు, సాధారణ ఫొటోలు, ఈ మేసేజింగ్ యాప్ లోని వీడి యోలను ఎవరూ కాపీ చేయకుండా స్క్రీన్ షాట్ తీసుకోకుండా భద్రతా చర్యలు తీసుకుంటోంది. దీంతో కంటెంట్ గానీ, ఫొటోలు గానీ దుర్వినియోగం అయ్యే అవకాశం లేదు.