Sukanya Samriddhi Yojana: రూ.165 పొదుపుతో..ఏకంగా రూ.28 లక్షలు పొందండిలా..

Sukanya Samriddhi Yojana:  రూ.165 పొదుపుతో..ఏకంగా రూ.28 లక్షలు పొందండిలా..

ఆడ పిల్లల బంగారు భవిష్యత్తుకోసం అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయి. భేటీ బచావో..భేటీ పడవో నినాదంతో కేంద్ర  ప్రభుత్వం మహిళల అభివృద్ధి లక్ష్యంగా అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టింది. అందులో సుకన్య సమృద్ధి యోజన పథకం ఒకటి. ఈ పథకంలో ఆడపిల్లల తల్లిదండ్రులు బిడ్డ పుట్టిన ప్పటినుంచి పాపకు 15 ఏళ్ల వయసు వచ్చే వరకు డిపాజిట్ చేయొచ్చు. ఈ పథకంలో పాప పేరుమీద అకౌంట్ తీసి కనీసం250 రూపాలయల నుంచి రూ. 1.5 ల క్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. కనీసం రోజుకు రూ.165 ల చొప్పున డిపాజిట్ చేయగలిగితే అధిక మొత్తాలను డ్రా చేసుకోవచ్చు.. పూర్తి వివరాలు తెలుసు కుందాం. 

అప్లయ్ చేయడం ఎలా ? 

ఇండియన్ పోస్టల్ బ్యాంకింగ్ సర్వీస్ లో ఈ స్కీమ్ లో ఈజీగా అప్లయ్ చేసుకోవచ్చు. లిస్టెండ్ బ్యాంకుల ద్వారా కూడా ఈ స్కీంలో చేరొచ్చు. ఈ స్కీంలో డిపాజిట్ చేసిన అమౌంట్ బట్టి ఏడాదికి 8.2శాతం వడ్డీ ని బ్యాంకు వారు చెల్లిస్తారు. పాప పేరున అకౌంట్ ఓపెన్ చేసినప్పటినుంచి అమ్మాయికి 15 ఏళ్లు వచ్చేవరకు ప్రతి ఏడాది డిపాజిట్ చేస్తూనే ఉండాలి. 15 ఏళ్లు నిండిన తర్వాత డబ్బు డిపాజిట్ చేయకున్నా కూడా ప్రతి ఏడాది వడ్డీ మాత్రం అకౌంట్లో జమ చేస్తూ వస్తారు.

మెచ్యూరిటి

డిపాజిట్ చేసిన డబ్బులు మాత్రం ఆ అమ్మాయికి 18 యేళ్లు నిండిన తర్వాత మాత్రమే తీసుకోవడానికి వీలుంటుంది. అది కూడా కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే డబ్బును 50శాతం విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అమ్మాయికి 21 ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే మొత్తం డబ్బును వడ్డీతో సహా డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది.  

మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు మాత్రం ఆ అమ్మాయికి 18 ఏళ్ల వయసు దాటిన తర్వాత మాత్రమే తీసుకోవడానికి వీలుంటుంది. అది కూడా కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే డబ్బును 50 శాతం విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. అదే విధంగా ఆ అమ్మాయికి 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే మొత్తం డబ్బును వడ్డీతో సహా వసూలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

అయితే ఈ డబ్బును విత్ డ్రా చేసుకోవాలంటే అమ్మయి చదువు లేదా పెళ్లికోసం అని తెలిపి మొత్తం డబ్బును వడ్డీతో సహా విత్ డ్రా చేసుకోవచ్చు. 

ఒకవేళ స్కీంలో చేరిన తర్వాత నాలుగేళ్లు కట్టి మిగితా రెండు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినా కూడా మళ్లీ అదే స్కీమ్ కంటిన్యూ చేయడానికి కొంత పెనాల్టీ చెల్లించి ఆ స్కీమును కంటిన్యూ చేసే అవకాశం కూడా ఉంది. 

ఈ స్కీంలో గనక మీరు నెలకు రూ.5 వేల చొప్పున డిపాజిట్ చేసినట్లయితే.. మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ. 28 లక్షల వరకు నగదును డ్రా చేసుకోవచ్చు.