రాష్ట్రంలో తొలి టీకా వేసుకున్న సఫాయి కార్మికురాలు

రాష్ట్రంలో తొలి టీకా వేసుకున్న సఫాయి కార్మికురాలు

గాంధీ ఆస్పత్రిలో మంత్రి ఈటల రాజేందర్ వ్యాక్సినేషన్ ప్రారంభించారు. మొదటి వ్యాక్సిన్‌ను ఆస్పత్రిలో పనిచేసే సఫాయి కార్మికురాలు కృష్ణమ్మకు ఇచ్చారు. రాష్ట్రంలో 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ఇస్తున్నట్లు మంత్రి ఈటల చెప్పారు. ‘కరోనా వైరస్ వల్ల దేశంలోని 135 కోట్ల ప్రజానీకం అల్లాడింది. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమయింది. ప్రధాని భావోద్వేగాలతో మాట్లాడారు. కరోనా వల్ల ఆప్తులను కోల్పోయాం. హెల్త్ కేర్ వర్కర్స్ ఫ్యామిలీని వదిలేసి మరీ వర్క్ చేశారు. అందుకే వ్యాక్సిన్ ముందుగా వాళ్లకే ఇచ్చాం. నిరంతరం వ్యాక్సిన్ పక్రియ కొనసాగుతుంది. ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ సిబ్బంది, పోలీస్, మున్సిపల్, ఫైర్, గ్రామపంచాయతీ.. ఇలా అన్ని డిపార్ట్‌మెంట్లకు వ్యాక్సిన్ ఇస్తం. వ్యాక్సిన్ ద్వారా కరోనాకు చరమ గీతం పాడదాం’ అని మంత్రి ఈటల అన్నారు.

For More News..

సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

మోడీ నోట తెలుగు పద్యం.. వ్యాక్సిన్ ప్రారంభించిన ప్రధాని

గుండెపోటుతో పాండ్యా తండ్రి మృతి