కరోనా హైదరాబాదీలను బాగా దెబ్బకొట్టింది

కరోనా హైదరాబాదీలను బాగా దెబ్బకొట్టింది

60 శాతం మంది ఆదాయం కోల్పోయారు

ఎక్కువగా ప్రభావితమైన సిటీ ఢిల్లీ
జీరోకి పడిపోయిన ఇన్‌‌కమ్‌‌లు

హైదరాబాద్, వెలుగు: కరోనా మహమ్మారితో హైదరాబాద్‌‌లో 60 శాతానికి పైగా ప్రజలు  తమ ఆదాయాలను కోల్పోయినట్టు పైసాబజార్ సర్వే రిపోర్ట్ వెల్లడించింది. కరోనా వైరస్‌‌తో ఆదాయాలు ఎక్కువగా కోల్పోయి, లోన్ల రీపేమెంట్ కెపాసిటీ తగ్గిపోయిన నగరాల్లో ఢిల్లీ–ఎన్‌‌సీఆర్, బెంగళూరు ముందంజలో ఉన్నట్టు చెప్పింది. ఆ తర్వాత ఎక్కువగా నష్టపోయింది హైదరాబాద్ వాసులే నని తెలిపింది.  టాప్ 6 మెట్రోల్లో చెన్నై అత్యంత తక్కువగా ప్రభావితమైందని వెల్లడించింది. 35 నగరాల నుంచి 24 ఏళ్ల నుంచి 57 ఏళ్ల మధ్య వయసున్న 8,500 మందికి పైగా కన్జూమర్లపై పైసాబజార్ డాట్ కామ్ ఈ సర్వే చేసింది. లక్ష రూపాయలు లేదా ఆపైన అప్పు ఉన్న వారిని ఈ సర్వేలో లెక్కల్లోకి తీసుకున్నారు.  సర్వే ప్రకారం, కరోనా లాక్‌‌డౌన్ ఆంక్షలతో 86 శాతానికి పైగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కస్టమర్లు తన ఆదాయాలను నష్టపోయారు. ఈ కరోనా మహమ్మారి, లాక్‌‌డౌన్‌‌తో నాలుగో వంతు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కస్టమర్లు తమ ఇన్‌‌కమ్‌‌లు జీరోగా ఉన్నట్టు చెప్పారు. శాలరీడ్ కస్టమర్లపైనా లాక్‌‌డౌన్ ప్రభావం బాగా చూపిందని సర్వే తెలిపింది. 56 శాతం మంది వేతన జీవుల జీతాలు కరోనా మహమ్మారితో ప్రభావితమైనట్టు సర్వే వెల్లడించింది. 12 శాతం మందికి ఉద్యోగాలు పోయాయి. వారికి ఎలాంటి ఆదాయ వనరు లేకుండా పోయిందని సర్వే తేల్చింది.

 

‘కరోనా మహమ్మారి మన దేశంలోకి వచ్చిన తొలి రెండు మూడు నెలల్లో మా కన్జూమర్లు బాగా ప్రభావితమయ్యారు. జూలై నుంచి కాస్త రికవరీ కనిపించింది. ఎకానమీ కూడా తిరిగి ప్రారంభమైంది. లాక్‌‌డౌన్ దెబ్బకు బాగా ఎఫెక్ట్ అయిన ట్రావెల్, ఏవియేషన్, ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్, హాస్పిటాలిటీ వంటి రంగాలు మెల్లమెల్లగా తిరిగి ప్రారంభకావడం మొదలయ్యాయి. బ్యాంక్‌‌లతో పాటు పెద్ద పెద్ద లెండర్లు కూడా ఈ సెగ్మెంట్లకు రుణాలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాయి’ అని పైసాబజార్ డాట్ కామ్ సీఈవో, కోఫౌండర్ నవీన్ కుక్రేజా తెలిపారు. కరోనా లాక్‌‌డౌన్‌‌ దెబ్బకు ఢిల్లీ, ఎన్‌‌సీఆర్ నగరాలు బాగా ప్రభావితమయ్యాయని, సర్వేలో పాల్గొన్న 70 శాతం మంది కన్జూమర్లు తమ ఆదాయాలపై నెగిటివ్ ప్రభావాన్ని చూపించిందని వెల్లడించారని సర్వే తెలిపింది. వీరిలో ఎన్‌‌సీఆర్‌‌‌‌కు చెందిన 16 శాతం కస్టమర్లు తమ ఆదాయాలు జీరోకి పడిపోయినట్టు చెప్పారు. పూర్తిగా ఆదాయాలు పోగొట్టుకున్న కస్టమర్లలో ఎక్కువ మంది ముంబై నుంచి ఉన్నారు. 26 శాతం మంది ముంబై వాసులు తమ ఇన్‌‌కమ్‌‌లు జీరోకి పడిపోయినట్టు వెల్లడించారు. ఆర్‌‌‌‌బీఐ కల్పించిన మారటోరియం ఆప్షన్‌‌ను సద్వినియోగం చేసుకున్న వారిలో ఎక్కువ మంది కూడా ముంబై నుంచే ఉన్నారు. ముంబై నుంచి సర్వేలో పాల్గొన్న 65 శాతం మంది కస్టమర్లు మారటోరియం తీసుకున్నారు.

జాబ్ పోతుందనే భయంతో మారటోరియం…

పైసాబజార్ డాట్‌‌ కామ్ సర్వేలో పాల్గొన్న 63 శాతం హైదరాబాద్ రెసిడెంట్స్‌‌ కరోనా మహమ్మారి తమ ఇన్‌‌కమ్‌‌లపై నెగిటివ్ ప్రభావాన్ని చూపించిందని వెల్లడించారు. 20 శాతం మంది పూర్తిగా తమ ఇన్‌‌కమ్‌‌లు కోల్పోయామని చెప్పగా… 80 శాతం మంది సెల్ఫ్ ఎంప్లాయ్డ్‌‌ రెసిడెంట్స్, 58 శాతం శాలరీడ్ సెగ్మెంట్ ప్రజలు తమ ఇన్‌‌కమ్‌‌లు నష్టపోయినట్టు చెప్పారు. అయితే సర్వే రిపోర్ట్ ప్రకారం మారటోరియం తీసుకున్న 34 శాతం మంది తమ ఉద్యోగాలను కోల్పోలేదు. కానీ కరోనా కారణంతో భవిష్యత్‌‌లో జాబ్ పోతుందనే భయంతో మారటోరియం తీసుకున్నట్టు సర్వే వెల్లడించింది.