
మేడ్చల్ జిల్లా దుండిగల్ బహదూర్ పల్లిలోని టెక్ మహీంద్ర యూనివర్సిటీలో కరోన కేసులు బయటపడ్డాయి. వర్సిటీలో పలువులు విద్యార్ధులకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. విద్యార్థులు కరోనా బారిన పడటంతో.. రేపు సెలవు ప్రకటించి... వర్శిటీ హాస్టల్ ను ఖాళీ చేయించారు. శానిటైజేషన్ చేసి తిరిగి క్లాసులు నిర్వహిస్తామని యూనివర్సిటీ ప్రతినిధులు తెలిపారు.
ఇద్దరు విద్యార్థులకు జ్వరం రావడంతో కరోన పరీక్షలు జరిపించింది టెక్ మహేంద్ర యూనివర్సిటీ యాజమాన్యం. ఇందులో 25 మంది విద్యార్థులకు , 5 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ తేలిందని మేడ్చల్ జిల్లా వైద్యాధికారిణి తెలిపారు. వైరస్ బారిన పడిన వారికి ఎలాంటి ప్రమాదం లేదని..ప్రస్తుతం వారంతా హోం ఐసోలేషన్ లో ఉన్నారని తెలిపారు.