
అమరావతి: ఏపీలో కరోనా టెస్ట్ రిజల్ట్స్ 50 నిమిషాల్లోనే అందనున్నాయి. దీని కోసం అవసరమైన టెస్టింగ్ కిట్‌లను పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని మెడ్‌టెక్ జోన్ అందుబాటులోకి తెచ్చింది. ఒక్క కిట్ తో 20 మందికి టెస్టులు చేయవచ్చు. కరోనా నివారణపై బుధవారం అమరావతిలోని క్యాంపు ఆఫీసులో జగన్ రివ్యూ చేశారు.ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ను పరిశీలించారు. ముందుగా 100 కిట్‌లను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిశీలనకు పంపామని, తయారీకి పర్మిషన్ వచ్చిందని పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. నెలరోజుల్లో 25వేల కిట్‌లను తయారు చేస్తామన్నారు.