వచ్చే నెలలోనే రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్

వచ్చే నెలలోనే రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్

ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని కేంద్రం సూచనలు

అన్ని రాష్ట్రాల హెల్త్​ డిపార్ట్​మెంట్లతో వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్‌, వెలుగు: మన రాష్ట్రంలో వచ్చే నెలలోనే కరోనా వ్యాక్సిన్​ అందుబాటులోకి రానుంది. జనవరి మూడో వారం నాటికల్లా వ్యాక్సిన్ స్టోరేజీ, పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హెల్త్​ డిపార్ట్​మెంట్​ను ఆదేశించింది. అన్ని రాష్ట్రాలకు తొలిదశ వ్యాక్సిన్ డోసులు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించింది. దీనిపై కేంద్ర హెల్త్​ మినిస్ట్రీ మంగళవారం అన్ని రాష్ట్రాల హెల్త్​డిపార్ట్​మెంట్​ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. టీకా స్టోరేజీ, పంపిణీకి సంబంధించి.. ఏమేం చేయాలి, ఏయే ఏర్పాట్లు అవసరమన్న అంశాలను రాష్ట్ర అధికారులకు వివరించింది.

ఈ మీటింగ్​కు సంబంధించి రాష్ట్ర అధికారులు చెప్పిన వివరాల మేరకు.. వచ్చే నెల 15వ తేదీ నాటికి తొలిదశ వ్యాక్సిన్ డోసులు రానున్నాయి. నెలాఖరుకల్లా పంపిణీ ప్రారంభమయ్యే చాన్స్​ ఉంది. అలాగే ఈ నెల చివర్లో ప్రధాని మోడీ అధికారికంగా టీకా పంపిణీని ప్రారంభించే అవకాశముందని అధికారులు తెలిపారు.

కోవిన్‌‌‌‌ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ సాయంతో..

కరోనా వ్యాక్సిన్ల మెయింటెనెన్స్, డిస్ట్రిబ్యూషన్​ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘కోవిన్‌‌‌‌’ సాఫ్ట్‌‌‌‌ వేర్‌‌‌‌ను రూపొందించింది. రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌‌‌‌  హెల్త్​ సిబ్బందికి తొలి విడత వ్యాక్సిన్​ ఇవ్వనున్నారు. ఇందుకోసం రాష్ట్ర హెల్త్​ డిపార్ట్​మెంట్​ వారందరి వివరాలు సేకరించి సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌లో, కేంద్ర వెబ్​సైట్లో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేయాల్సి ఉంటుంది. అందులో పేరు ఉంటేనే వ్యాక్సిన్​ వేస్తారు. ఫ్రంట్‌‌‌‌ లైన్‌‌‌‌ వర్కర్స్‌‌‌‌ కోవిన్‌‌‌‌ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ లో సెల్ఫ్‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌‌‌  చేసుకోవచ్చని, అందుకు వారి ఐడెంటిటీని వాడొచ్చని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. దీనికి ఆధార్​ అవసరం లేదని, సరైన ఇతర ఐడెంటిటీ ఏదైనా సరేనని అధికారులు చెప్తున్నారు. అయితే ఇలా సెల్ఫ్‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌‌‌ చేసుకున్న వారి వివరాలను మెడికల్‌‌‌‌  డిపార్ట్​మెంట్​ మరోసారి తనిఖీ చేస్తుంది. ఇక టీకా కోసం స్పాట్‌‌‌‌ సెల్ఫ్‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌‌‌కు అనుమతించబోమని కేంద్రం స్పష్టం చేసింది.

ఒక్కో వ్యాక్సిన్​ సెంటర్​లో రెండు టీమ్​లతో..

ఒక్కో సెంటర్​లో 100 మందికి కరోనా వ్యాక్సిన్​ ఇవ్వనున్నారు. ఇందులో 2 టీమ్​లు పనిచేస్తాయి. వ్యాక్సిన్​ కోసం వచ్చిన వారి వివరాలను ఒక టీం చెక్‌‌‌‌  చేసి, సర్టిఫై చేస్తుంది. మరో టీంలో ఐదుగురు ఉంటారు. ఒక వ్యాక్సినేటర్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌, డాక్టర్‌‌‌‌, నర్సు, ఏఎన్‌‌‌‌ఎంతోపాటు మరొక హెల్పర్​ ఉండే టీమ్.. వ్యాక్సిన్​ వేస్తుంది. సదరు వ్యక్తి తర్వాత అరగంటపాటు కచ్చితంగా వ్యాక్సిన్‌‌‌‌ కేంద్రం వద్దనే ఉండాలి. ఎలాంటి సైడ్‌‌‌‌ ఎఫెక్ట్స్, సమస్యలు లేవనుకున్న తర్వాతే అక్కడి నుంచి వెళ్లడానికి పర్మిషన్​ ఇస్తారు.