తెలంగాణలో ఒకేరోజు 209 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో ఒకేరోజు 209 కరోనా కేసులు నమోదు

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. గురువారం ఒ క్క రోజే 209 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. రాష్ట్రంలో ఒకే రోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇందులో గ్రేటర్ హై దరాబాద్‌‌లోనే 175 కేసులు నమోదవగా, జిల్లాల్లో 33 కేసులు వచ్చాయి. ఇతర రాష్ట్రాల నుంచి తిరిగొచ్చిన వలస కార్మికుల్లోమరో వ్యక్తికి పాజిటివ్‌‌వచ్చింది. వీటితో కలిపి కేసుల సంఖ్య 4,320కి చేరింది. ఇప్పటి వరకు 1,993 మంది వైరస్ నుంచి కోలుకున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్ర కటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,162 యాక్టివ్ కేసులుండగా, ఇందులో 600 మంది గాంధీలో ట్రీట్మెంట్పొందుతున్నారు. మరో వంద మంది వరకూ ప్రైవేటు హాస్పిటల్స్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మిగిలిన వాళ్లంతా హోం ఐసోలేషన్‌‌లో ఉన్నారు. రాష్ట్రంలో కరోనాతో మరో తొమ్మిది మంది చనిపోయారు. అయితే మృతుల వివరా లను ప్రభుత్వం వెల్లడించలేదు. వీటితో కలిపి రా ష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 165కు చేరింది. మొత్తంకేసుల్లోమరణాల శాతం3.81కి చేరింది