ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ఫీవర్, కరోనా వార్డులు రెడీ

ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ఫీవర్, కరోనా వార్డులు రెడీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతుండగా సిటీలోని ప్రధాన ఆస్పత్రుల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో14 కేసులు నమోదవగా.. హైదరాబాద్​లో 6  యాక్టివ్​ కేసులున్నాయి. దీంతో  అధికారులు అలర్ట్ అయ్యారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఐసీయూతో పాటు, 5 ఐసోలేషన్ బెడ్స్ సిద్ధం చేశారు. వెంటిలేటర్, ఆక్సిజన్ , ఆర్టీపీసీఆర్​ కిట్లు, మెడిసిన్​కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గాంధీ ఆస్పత్రిలో గత కరోనా టైంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్​ వార్డులు ప్రస్తుతం రెడీ ఉన్నాయని సూపరిండిండెంట్​ రాజారావు తెలిపారు. 

ఫీవర్​ ఆస్పత్రిలో 32 బెడ్లతో ఐసోలేషన్ ​సెంటర్ ​ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. ఆస్పత్రి సిబ్బంది పరిశుభ్రత, సోషల్ డిస్టెన్స్ కచ్చితంగా పాటించాలని అధికారులు ఆదేశించారు. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆస్పత్రిలో , ఇండ్లలో  ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. జనం బయటకు వెళ్లేటప్పడు మాస్కులు ధరించాలని, వీలైనన్ని సార్లు చేతులను సబ్బు, శానిటైజర్​తో కడగాలని పేర్కొన్నారు. జ్వరం దగ్గు, జలుబుతో బాధపడేవారికి దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించారు.