పురుగుల‌న్నం మాకొద్దు : మ‌ండిప‌డుతున్న డాక్ట‌ర్లు

పురుగుల‌న్నం మాకొద్దు : మ‌ండిప‌డుతున్న డాక్ట‌ర్లు

క‌రోనా వారియ‌ర్స్ డాక్ట‌ర్స్ కు స‌దుపాయాలు క‌ల్పించ‌డంలో ఆయా రాష్ట్ర ‌ప్ర‌భుత్వాలు విఫ‌ల‌మ‌వుతున్నాయ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా డాక్ట‌ర్స్ కు అందించే భోజ‌నంలో పురుగులు ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

లక్నో కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ (KGMU) క్యాంప‌స్ లో డాక్ట‌ర్లు క‌రోనా వైర‌స్ పేషెంట్ల‌కు ట్రీట్మెంట్ అందిస్తూ అక్క‌డే ఉంటుంన్నారు.

అయితే త‌మ‌కు అందిస్తున్న ఆహారంలో పురుగులు, కీట‌కాలున్నాయంటూ యూపీ యునైటెడ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నీరజ్ కుమార్ మిశ్రా అన్నం ప్లేట్లో పురుగులున్న రెండు ఫోటోల్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

డాక్ట‌ర్లు త‌మ క‌ర్త‌వ్యంతో ప్రాణాల‌కు తెగించి విధులు నిర్వ‌హిస్తున్నారు. అలాంటి వారికి క‌నీస సౌక‌ర్యాల‌కు క‌ల్పించ‌క‌పోవ‌డం దారుణ‌మ‌ని అన్నారు. ద‌య‌చేసి డాక్ట‌ర్ల‌కు ప్రాద‌మిక అవ‌స‌రాల‌ను తీర్చాల‌ని కోరారు.

కరోనా యోధుల పట్ల ‘ఉదాసీన వైఖరి’ ఉందని ఆరోపిస్తూ రెసిడెంట్ డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్డీడబ్ల్యూఏ) వైస్-ఛాన్సలర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.

క‌రోనా బాధితుల కోసం ఎంతో చేస్తున్న మా ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ యోధుల్ని క‌నీస సౌక‌ర్యాలు క‌ల్పించ‌క‌పోవ‌డం అమాన‌వీయం
అంటూ లేఖ‌లో పేర్కొన్నారు.

అయితే డాక్ట‌ర్ నీర‌జ్ కుమార్ వ్యాఖ్య‌ల‌పై కేజీఎంయూ యూనివ‌ర్సిటీ ప్ర‌తినిధి డాక్ట‌ర్ సుధీర్ సింగ్ స్పందించారు. క‌రోనా బాధితుల‌కు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్ట‌ర్లకు అన్నీర‌కాల స‌దుపాయాల్ని క‌ల్పిస్తున్నామ‌ని, భోజ‌న స‌దుపాయాల‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ చేప‌డ‌తామ‌ని చెప్పారు.