గ్రేటర్ లో బీజేపీ గెలిస్తే కరోనా వ్యాక్సిన్ ఫ్రీ

గ్రేటర్ లో బీజేపీ గెలిస్తే కరోనా వ్యాక్సిన్ ఫ్రీ

రాజ్యాంగాన్ని మోడీ సర్కార్ కాపాడుతుందన్నారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్. జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను  కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో  బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ,  వివేక్ వెంకట స్వామి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఫడ్నవిస్.. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర చాలా ఉందన్నారు. ప్రజలకు ఏం కావాలో తాము అర్థం చేసుకున్నామన్నారు. ప్రజలతో మాట్లాడి మేనిఫెస్టో తయరు చేశామన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణకు స్వాతంత్ర్య దినోత్సవమన్నారు.

బీజేపీ గ్రేటర్ మేనిఫెస్టో 2020 ముఖ్యాంశాలు..

  •  గ్రేటర్ లో బీజేపీ గెలిస్తే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తాం.
  • కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తాం.
  • కార్పొరేషన్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ అందజేస్తాం.
  • ఎల్ఆర్ఎస్ రద్దు
  • వరదల్లో నష్టపోయిన వారికి రూ. 25 వేల సాయం
  • హైదరబాద్ లోడ్రైనేజీ వ్యవస్థను బాగు చేస్తాం
  • అక్రమ నిర్మాణాలను కూల్చేస్తాం
  • బస్సుల్లో, మెట్రోలో  మహిళలకు ఉచిత ప్రయాణం.
  • ఆన్ లైన్ ఎడ్యుకేషన్ కోసం హై క్వాలిటీ వైఫై
  • గవర్నమెంట్ స్కూలు పిల్లలకు ట్యాబ్ ఉచిత వైఫై
  • లక్షమంది పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఉచితంగా ఇళ్లు,
  • 125 గజాల లోపు ఇళ్లకు ఉచితంగా అనుమతి
  • నమామీ గంగే లాగా మూసిని డెవ్ లప్ చేస్తాం
  • పేదలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్