భారత్లో ప్రవేశించిన కరోనా కొత్త వేరియెంట్

భారత్లో ప్రవేశించిన కరోనా కొత్త వేరియెంట్

ముంబై : కరోనా మహమ్మారి ఇప్పట్లో కనుమరుగయ్యే సూచనలు కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ 19 ఉద్ధృతి తగ్గుతుందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కొత్త వేరియెంట్ కలవర పెడుతోంది. బ్రిటన్లో తొలిసారి వెలుగుచూసిన కరోనా ఎక్స్ఈ వేరియెంట్ తాజాగా భారత్లో బయటపడింది. ముంబైలో ఎక్స్ఈ వేరియెంట్ తొలి కేసు నమోదైనట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. అయితే వైరస్ సోకిన వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు లేవని చెప్పింది. ముంబైకి చెందిన 230 మంది కరోనా బాధితుల శాంపిల్స్కు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించగా.. వారిలో 228 మందికి ఒమిక్రాన్ ఉన్నట్లు తేలింది. ఒకరిలో కప్పా, మరొకరిలో ఎక్స్ఈ వేరియెంట్ బయటపడింది. 

కోవిడ్ 19 కన్నా కొత్త వేరియెంట్ ఎక్స్ఈ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతవారం హెచ్చరించింది. యూకేలో ఇప్పటి వరకు637  కొత్త వేరియెంట్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ సబ్ వేరియెంట్లైన బీఏ.1, బీఏ 2ల కలయికతో వైరస్ రూపాంతరం చెందిందని సైంటిస్టులు అంటున్నారు. ఒమిక్రాన్ తో పోలిస్తే ఎక్స్ఈ వేరియెంట్ 10శాతం ఎక్కువ వేగంగా వ్యాపిస్తుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

For more news..

కేసీఆర్ సంత‌కం రైతులకు మరణశాసనమైంది