లాక్​డౌన్ ఎత్తివేయడం తప్పు.. పిటిషనర్​కు హైకోర్టు భారీ ఫైన్

లాక్​డౌన్ ఎత్తివేయడం తప్పు..  పిటిషనర్​కు హైకోర్టు భారీ ఫైన్

న్యూఢిల్లీ: లాక్​డౌన్ సడలింపులపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ పిటిషన్ వేసిన లా స్టూడెంట్​కు ఢిల్లీ హై కోర్టు షాకిచ్చింది. మే 30న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సరికాదంటూ ఐదవ సంవత్సరం న్యాయ విద్యార్థి అర్జున్ అగర్వాల్ వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. అంతే కాకుండా పిటిషనర్ పై రూ.20 వేల పెనాల్టీ విధించింది. కేంద్రం లాక్‌డౌ‌‌న్‌ను ఒక్కసారిగా ఎత్తివేయలేదని, విడతల వారీగా ఈ నిర్ణయాన్ని అమలు చేసిందని కోర్టు 23 పేజీల తీర్పునిచ్చింది.
అయితే, ప్రభుత్వం ఉత్తర్వులు సరైనవి కాకపోతే.. నిషేధించిన కార్యకలాపాలను తిరిగి తెరవాల్సిన అవసరం లేదా అని కోర్టు ప్రశ్నించింది. ఎంతో మంది పేదలు ఆకలితో చనిపోతున్నారని, ఆ మేరకు ప్రభుత్వం దశలవారీగా సడలింపులు కల్పించిందని పేర్కొంది. అసంబద్ధమైన పరిశీలన ఆధారంగా పిటిషనర్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14పే ఉల్లంఘించడమే అవుతుందని కోర్టు పేర్కొంది. పిటిషన్ ను పూర్తిగా తప్పుగా భావించిన కోర్టు ఇది కేవలం ప్రచారం పొందడానికి మాత్రమే దాఖలు చేసినట్లుగా ఉందని అభిప్రాయపడింది.