కరోనా వైరస్: వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కరోనా వైరస్: వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
  • వృద్ధుల్లోనే కరోనా ప్రభావం ఎక్కువ
  • వైరస్ సోకకుండా ముందస్తు జాగ్రత్తలు అవసరం

కరోనా వైరస్ ప్రభావం చిల్డ్రన్స్, యంగ్ పర్సన్స్ తో  పోలిస్తే వృద్ధుల్లోనే ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వారికి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం… వృద్ధుల్లో సాధారణంగా ఉండే షుగర్, బీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో రిస్క్ ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దలకు వైరస్ సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మన దేశంలో ప్రతి ఇంట్లోనూ వృద్ధులు ఉంటారు. మనం బయట ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వస్తుంటాం. ఒకవేళ మనకు వైరస్ సోకితే, అదికాస్తా పెద్దలకూ వ్యాపిస్తుంది. యంగ్ పర్సన్స్ లో వైరస్ లక్షణాలు బయట పడేందుకు కొంత సమయం పడుతుంది. అది మనం గుర్తించేలోపే ఇంట్లోని వృద్ధులకు సోకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వృద్ధుల విషయంలో కుటుంబ సభ్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

 అవేమిటంటే…

  • ఇంట్లో ఎవరికైనా కరోనా లక్షణాలున్నా, వైరస్ సోకినా వృద్ధులకు దూరంగా ఉండాలి.
  • సాధారణంగా వృద్ధుల దగ్గరికి వెళ్లినా కనీసం ఒక మీటర్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేయాలి.
  • మీరు బయట ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వస్తుంటారు. ఇంట్లోని వస్తువులను తాకుతుంటారు. వాటిని ఇంట్లోని పెద్దలు కూడా తాకే అవకాశం ఉంది. అందుకే బయటకు వెళ్లొచ్చిన వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
  • అలాగే ఇంట్లోని డోర్లు, టేబుల్స్ ను రెగ్యులర్ గా శానిటైజర్ తో క్లీన్ చేయాలి.
  • ఇండ్లలో చాలా వరకూ ఒకే టూత్ పేస్ట్, సబ్బు, టవల్, కుర్చీలు… ఇలా కొన్ని వస్తువులను కామన్ గా వాడుతుంటారు. ఇక నుంచి అలా చేయకుండా పెద్దల వస్తువులను సెపరేట్ గా ఉంచండి. అదే విధంగా వృద్ధుల బట్టలను మీ బట్టలతో కలిపి ఉతకవద్దు.
  • అలా అని పెద్దలు ఒంటరిగా ఫీలయ్యేలా చేయొద్దు. సామాజికంగా బహిష్కరించినట్టు ప్రవర్తించొద్దు. వారు వివిధ పనుల్లో నిమగ్నమయ్యేలా చూడాలి.
  • మామూలుగా వృద్ధులు ఉదయం, సాయంత్రం వాకింగ్ కు వెళ్తుంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి వారిని బుక్ రీడింగ్ వైపు మళ్లించాలి. ఫోన్లలోనే ఎన్నో భాషల బుక్స్ ను చదువుకునే వీలుంది.
  • ఇప్పుడు స్మార్ట్ ఫోన్లతో ప్రపంచమే మన చేతుల్లో ఉంది. వృద్ధులకు కావాల్సిన ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వారికి స్మార్ట్ ఫోన్ వినియోగించడం నేర్పించి, వారికి కావాల్సింది చూసుకునేలా ఎంకరేజ్ చేయాలి.
  • ఒకవేళ వృద్ధుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.