సదర్ దున్నపోతుకు కాస్ట్లీ లిక్కర్.. ప్రత్యేక ఆకర్షణగా వస్తాద్ గుమాన్ కాళీ దున్నరాజు

సదర్ దున్నపోతుకు కాస్ట్లీ లిక్కర్.. ప్రత్యేక ఆకర్షణగా వస్తాద్ గుమాన్ కాళీ దున్నరాజు

తెలంగాణలో బోనాల తర్వాత మస్త్ గ్రాండ్‎గా చేసే మరో పండుగ సదర్ ఉత్సవం. సదర్ సమ్మేళనంగా పిలిచే ఈ పండుగ సికింద్రాబాద్, హైదరాబాద్ సిటీల్లో చాలా ఫేమస్. దీపావళి తర్వాత సెకండ్ డే యాదవ కమ్యూనిటీ జరిపే సదర్ పండగకు దాదాపు 70 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. సిటీలోని ముషీరాబాద్లో నిర్వహించే సదర్ అన్నింటికన్నా మస్త్ ఫేమస్. యాదవులు తమ దున్నపోతుల్లో బలమైన, అందమైన వాటిని ఈ పండుగలో ప్రదర్శిస్తారు. 

దున్నపోతులకు పూలదండలు, గజ్జలు, ముత్యాల మాలలు, పసుపు, కుంకుమలు, పట్టు పరదాలతో మంచిగా రెడీ చేసి, మొయిన్ సెంటర్లు, ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. యాదవులకు ప్రత్యేకమైన 'డవక్- దన్కీ-దన్' స్పెషల్బ్యాంక్ తో దున్నపోతుల చుట్టూ స్టెప్పులు వేస్తూ సంబరాలు చేసుకుంటారు. దున్నపోతులతో కుస్తీ పడుతూ విన్యాసాలు, డ్రాన్స్‎లు చేయిస్తారు. ఇది సదర్‎కు స్పెషల్ అట్రాక్షన్‎గా నిలుస్తాయి. 

తీన్మార్ స్టెప్పులు.. దక్నక్ డ్యాన్స్‎లతో ఫుల్ జోష్.. యూత్ మొత్తం ఉత్సహంగా సదర్ వేడుకల్లో పాల్గొంటారు. సదర్‎కు వచ్చిన వారికి కులమతాలకు అతీతంగా ఒకరికొకరు అలాయ్ బలయ్ తీసుకుంటారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా హైదరాబాద్ సిటీలో సదర్ సందడి మొదలైంది. 

కాగా.. ఈ ఏడాది సదర్ వేడుకల్లో వస్తాద్ గుమాన్ కాళీ దున్నరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2500 కేజీల బరువు.. 7 అడుగుల వెడల్పు ఉన్న ఈ దున్నపోతును మధు యాదవ్ కేరళ నుంచి తీసుకొచ్చాడు. దున్నరాజుకు ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడమే కాకుండా.. కాస్ట్లీ రాయల్ సెల్యూట్ మందు తాగిస్తున్నాడు మధు యాదవ్. సదర్ ఉత్సవాల కోసం వస్తాద్ గుమాన్ కాళీ దున్నరాజుతో పాటు హర్యానా నుంచి ప్రత్యేకంగా మరో 15 దున్నపోతులను తీసుకొచ్చాడు మధు యాదవ్.

అయితే, సదర్ దున్నుపోతుకు మధు యాదవ్ మద్యం తాగించడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. మూగ జీవాలకు మద్యం తాగించడాన్ని పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మద్యం మత్తులో మనిషే జంతువులా ప్రవర్తిస్తాడు.. అలాంటిది మూగ జీవాలకు మద్యం తాగిపిస్తే మత్తులో ఉన్న వాటిని ఎలా కంట్రోల్ చేస్తారని ప్రశ్నిస్తు్న్నారు.