కోటివిటీ ఆఫీస్ ప్రారంభం

కోటివిటీ ఆఫీస్ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: అమెరికాకు చెందిన డేటా ఆధారిత ఆరోగ్య సేవల సంస్థ కోటివిటీ హైదరాబాద్ లోని ఉప్పల్‌‌‌‌లో కొత్త ఆఫీసును సోమవారం ప్రారంభించింది. 

900 వర్క్ స్టేషన్లతో కూడిన ఈ కేంద్రం ద్వారా హెల్త్ కేర్, టెక్నికల్​ విభాగాల్లో వందలాది కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. 

ఇప్పటికే హైటెక్ సిటీలో 2,200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజా విస్తరణతో సాఫ్ట్‌‌‌‌వేర్ అభివృద్ధి, ఐటీ సపోర్ట్ సేవలు మరింత మెరుగవుతాయి. పుణే, కోయంబత్తూరులోనూ  ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది.