
చొప్పదండి, వెలుగు: చొప్పదండి మున్సిపాలిటీలో శుక్రవారం కో-ఆప్షన్ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఈ ఎన్నికలలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రతిపాదించిన ప్యానెల్ కు చుక్కెదురైంది. ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్కిటీ చెందిన కొందరు కౌన్సిలర్లు, ఇద్దరు బీజేపీ, ఇద్దరు కాంగ్రెస్ పార్టీకౌన్సిలర్ల మద్దతుతో మైనార్ విభాగంలో యండీ. టీ అజ్జు, అమీనా సుల్తానా, జనరల్ విభాగంలో అమర కొండ తిరుపతి, గండి లలిత బరిలో నిలిచి కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీ చైర్పర్సన్ గుర్రం నీరజ అధ్యక్షతన మున్సిపాలిటీలో నిర్వహించిన కో ఆప్షన్ ఎన్నికలో చైర్పర్సన్సహా 14 మంది సభ్యులతో పాటు ఎక్స్అఫిషీయో మెంబర్గా ఎమ్మెల్యే ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నిక కు హాజరైన టీఆర్ఎస్ పార్కిటీ చెందిన 12వ వార్డు కౌన్సిలర్ దండె జమున ఎవరికి ఓటు వేయకుండా తటస్థంగా ఉన్నారు.
ఎక్స్అఫిషియో సభ్యునిగా ఎమ్మెల్యే తాను బలపరిచిన ముగ్గురు అభ్యర్థులు గొల్లపల్లి ప్రభావతి, ఇంద్రసేనారెడ్డి , జహీరొద్దీన్కుఓటు వేసినా మెజారిటీ రాక వారు ఓడిపోయారు. ఎమ్మెల్యేప్యానెల్ ప్రతిపాదించిన మైనార్ మహిళా అభ్యర్థి షబానాకు కాకుండా మరో అభ్యర్థిసమీనా సుల్తానాకు ఎమ్మెల్యేతో పాటు చైర్పర్సన్, వైస్చైర్పర్సన్లు ఓటు వేయడం గమనార్హం. గురువారం రాత్రి ప్రత్యేక క్యాంపు ఏర్పాట్లు చేసినా బీజేపీ, కాంగ్రెస్కు చెందిన నలుగురు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్కిటీ చెందిన నలుగురు కౌన్సిలర్లు ఎన్నికవరకు ఒకేచోట ఉన్నారు. ఎమ్మెల్యే ప్యానెల్ ను ఓడించారు. ఓటింగ్ అనంతరం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ క్యాంప్ ఆఫీస్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గెలిచిన కో ఆప్షన్ సభ్యులంతా టీఆర్ఎస్ పార్టీకి చెందినవారేనని పేర్కొన్నారు.