స్కూటీపై వెళుతూ స్నానం చేశారు.. సబ్బు, షాంపూ లేవమ్మా

స్కూటీపై వెళుతూ స్నానం చేశారు.. సబ్బు, షాంపూ లేవమ్మా

సోషల్ మీడియాలో వైరల్ గా మారేందుకు ఏం చేయడానికైనా వెనకడుగు వేయడం లేదు. కొందరు మంచి, వెరైటీ పనులు చేసి పాపులర్ అయితే.. మరికొందరేమో వింతైన, ఆశ్చర్యకరమైన పనులు చేస్తూ ట్రెండింగ్ లో నిలుస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఓ యువకుడు, యువతి స్కూటీపై వెళ్తూ, స్నానం చేసి వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తోంది.

థానేలో జరిగిన ఈ వీడియో ట్విట్టర్‌లో విస్తృతంగా షేర్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో, మహారాష్ట్ర థానే జిల్లాలోని ఉల్హాస్నగర్ లోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక పురుషుడు, స్త్రీ స్కూటర్ మీద కూర్చుని ఉండడం చూడవచ్చు. ఆ మహిళ ఆకుపచ్చ బకెట్‌ను వారిద్దరి మధ్యలో పెట్టుకుని, ఓ ఎర్రటి మగ్గుతో తనపై, యువకుడిపై నీటిని పోసుకోవడం కూడా గమనించవచ్చు. ఇలా వారిద్దరూ స్కూటీపై ప్రయాణిస్తూనే.. స్నానం చేయడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. ట్రాఫిక్ లో స్కూటీని ఆపినా ఆ యువతి, యువకుడిపై నీటిని పోస్తూనే ఉంది. దీంతో చుట్టూ ఉన్న వారంతా వారినే చూస్తూ నవ్వడం ప్రారంభించారు.

ఈ వీడియోలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు ముంబై పోలీసులకు కంప్లైంట్ చేశారు. హెల్మెట్ లేకుండా బైక్ రైడ్ చేశారని, పబ్లిక్ నాన్ సెన్స్ క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ తర్వాత బైక్ నడిపిన ముంబైకి చెందిన యూట్యూబర్ ఆదర్శ్ శుక్లా ట్రాఫిక్ నియమాలను పాటించనందుకు ముంబై పోలీసులకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క్షమాపణలు చెప్పాడు. "తాను స్నానం చేస్తూ యాక్టివాను నడుపుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సమయంలో తాను హెల్మెట్ ధరించలేదుని.. అది తన అతి పెద్ద తప్పుని అతను అంగీకరిస్తున్నట్టు రాసుకొచ్చాడు. డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్లు ధరించనందుకు గానూ జరిమానా చెల్లిస్తానని కూడా శుక్లా చెప్పాడు. దయచేసి తన అరెస్టు చేయాలన్న వార్తను స్ప్రెడ్ చేయకండంటూ కోరాడు. తాను తప్పు చేశానని, దానికి జరిమానా చెల్లిస్తానని అతను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చెప్పాడు.

https://twitter.com/ItsAamAadmi/status/1658000635789479937