ఏపీలో మరో 66 కరోనా కేసులు

ఏపీలో మరో 66 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కరోనా టెస్టులు పెంచినప్పటి నుంచి ప్రతిరోజు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం కొత్తగా 66 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసులు 2,780 కి చేరుకున్నాయని అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన ఒక రోజులో వైరస్ కారణంగా ఎటువంటి మరణాలు సంభవించలేదని తెలిపింది. ఇప్పటికి రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 56గా ఉంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 11,357 మంది శాంపిల్స్ టెస్ట్ చేశామని తెలిపింది. వివిధ ఆస్పత్రుల నుంచి 29 మంది కోలుకుని డిశ్చార్చి అయ్యారని చెప్పింది. దీంతో మొత్తం రికవరీ అయిన వారి సంఖ్య 1,807 కి పెరిగింది. 764 మంది ట్రీట్​మెంట్ తీసుకుంటున్నారు. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 153 మంది ఉన్నారు.