అమెరికాలో మళ్లీ కరోనా కల్లోలం : 25 రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్న కేసులు

అమెరికాలో మళ్లీ కరోనా కల్లోలం : 25 రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్న కేసులు

అమెరికాలో మళ్లీ వణికిపోతుంది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య అమెరికాలో సమ్మర్ సీజన్.. ఇదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి జరగటం.. కేసులు భారీగా నమోదు కావటంతో అమెరికా వైద్య శాఖ అప్రమత్తం అయ్యింది. 

అమెరికాలోని 25 రాష్ట్రాల్లో కరోనా కల్లోలం ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఫ్లోరిడా, టెక్సాస్, కాలిఫోర్నియా, ఒహియో వంటి రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఉ:దని.. కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతున్నట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వెల్లడించింది. 

ALSO READ | న్యూయార్క్ను ముంచెత్తిన వాన

అమెరికాలోని సమ్మర్ సీజన్ కావటంతో వేడిగాలులు వీస్తున్నాయి. ఇదే సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున సమ్మర్ టూర్లు వేస్తున్నారు. కరోనా కేసుల పెరుగుదలకు ఇది కూడా కారణం అని స్పష్టం చేస్తున్నారు అధికారులు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని సగం రాష్ట్రాల్లో ఇన్ఫెక్షన్స్ పెరుగుదల కనిపిస్తుందని.. ఫ్లోరిడా, టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో NB.1.8.1, XFG వంటి కొత్త రకం కరోనా వైరస్ ఎటాక్ అవుతుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అక్కడి వైద్య అధికారులు. ఈ వైరస్ ఎటాక్ అయిన వ్యక్తుల్లో గొంతు నొప్పి అధికంగా ఉంటుందని.. గుండె బరువుగా ఉంటుందని.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు వైద్య అధికారులు.

అమెరికాలో ప్రస్తుతం వ్యాప్తిస్తున్న కరోనా వైరస్ రకాన్ని మురుగునీటిలో అధికంగా ఉంటుందని.. ప్రజలు అందరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. ఫంక్షన్లు, రవాణా  హోటల్స్ ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. 

అమెరికాలో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న కరోనా రకం  NB.1.8.1, XFG  వైరస్ లు ప్రాణాంతకం కాకపోయినా.. అనారోగ్యంతో ఉండే వాళ్లకు ఈ వైరస్ ఎటాక్ అయితే ప్రాణాలకు ముప్పు ఉంటుందని.. అదే విధంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలని.. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు అక్కడి వైద్య అధికారులు.

అమెరికాలో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి అనే కల్లోలం రేపుతోంది. 25 రాష్ట్రాల్లో గుర్తించదగిన స్థాయిలో కేసుల సంఖ్య పెరుగుదల కూడా జనాన్ని ఆందోళనకు గురి చేస్తుంది.