ఆక్సిజన్ సిలిండర్ తో ఆఫీస్ కు వచ్చిన బ్యాంక్ మేనేజర్

ఆక్సిజన్ సిలిండర్ తో  ఆఫీస్ కు వచ్చిన బ్యాంక్ మేనేజర్

జార్ఖండ్ లోని బొకారో పంజాబ్ నేషనల్ బ్యాంకు మేనేజర్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని ఆఫీసుకి రావడం వైరల్ అయింది. మేనేజర్ గా పనిచేస్తున్న అరవింద్ కుమార్.. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. సడెన్ గా ఆక్సిజన్ సపోర్ట్ తో ఆఫీస్ కు వచ్చాడు అరవింద్ కుమార్. ఆయనకు తోడుగా భార్య, కొడుకు కూడా ఆఫీసుకు వచ్చారు. లీవ్ అడిగితే సీనియర్లు పర్మిషన్ ఇవ్వలేదని, అందుకే ఆక్సిజన్ సిలిండర్ తో ఆఫీస్ కు వచ్చానని ఆరోపిస్తున్నాడు మేనేజర్. తన లంగ్స్ లో ఇంకా ఇన్ఫెక్షన్ ఉందని, పూర్తిగా కోలుకోవడానికి టైమ్ పడుతుందని చెప్తున్నాడు. అందుకే లీవ్ అడిగానని, సీనియర్స్ ఒప్పుకోలేదంటున్నాడు అరవింద్ కుమార్.

అరవింద్ కుమార్ ఆరోపణల్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తిప్పికొట్టింది. అదంతా డ్రామాగా కొట్టిపడేశారు బ్యాంక్ ఉన్నతాధికారులు. అరవింద్ కుమార్ పై ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ జరుగుతోందని వివరణ ఇచ్చారు. అరవింద్ తన ఉద్యోగానికి రిజైన్ చేశారని, డిపార్ట్ మెంటల్ ఎంక్వైరీ నడుస్తున్న కారణంగా రిజెక్ట్ చేశామని చెప్తున్నారు. అంతేకాదు పర్మిషన్ లేకుండానే రెండేళ్లుగా ఆయన బ్యాంకుకు రావడం లేదంటోంది పంజాబ్ నేషనల్ బ్యాంక్. మొత్తానికి అరవింద్ కుమార్ వీడియో సోషల్ మీడియోలో వైరల్ గా మారింది.