కేరళలో కరోనా న్యూ వేరియంట్..ఇది చాలా స్ట్రాంగ్ అంటున్న నిపుణులు

కేరళలో కరోనా న్యూ వేరియంట్..ఇది చాలా స్ట్రాంగ్ అంటున్న నిపుణులు

కేరళలో కరోనా 19 కొత్త సబ్ వేరియంట్ కనుగొనబడింది. 79 ఏళ్ల వృద్ధురాలిలో కరోనా కొత్త వేరియంట్ JN.1 ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. దక్షిణాది రాష్ట్రాల్లో దీని ప్రభావం గురించి ఆందోళనలు తలెత్తుతున్నాయి. 2023 సెప్టెంబర్ లో యునైటెడ్ స్టేట్స్  మొదటిసారి కనిపించిన JN.1 వేరియంట్ BA.2.86 కు వారసుడు. కోవిడ్ 19 సబ్ వేరియంట్ ను డిసెంబర్ 8న కేరళలో కనుగొన్నారు. కేరళలో నవంబర్ నెలలో మొత్తం 479 కోవిడ్ కేసులు నమోదు అయితే.. తాజాగా డిసెంబర్ లో 825 కేసులు నమోదు అయ్యాయని గత నెలతో పోలిస్తే అత్యధికం అని నివేదికలు చెపుతున్నాయి. కేరళలో కోవిడ్ తో నవంబర్ లో ఒకరు చనిపోగా.. డిసెంబర్ లో ఇద్దరు చనిపోయారు. 

నవంబర్ 18న 79ఏళ్ల మహిళనుంచి వచ్చిన శాంపిల్స్ ను పరీక్షించగా.. RT PCR పరీక్షలో కొత్త వేరియంట్ JN.1 ఉన్నట్లు తేలింది. ఆమెకు ఇన్ ఫ్ల్యూయెంజా వంటి అనారోగ్య లక్షణాలున్నాయని, కోవిడ్ నుంచి ఆమె కోలుకున్నట్లు వైద్యులుతెలిపారు. అంతకుముందు సింగపూర్ లో JN.1 సబ్ వేరియంట్ ను ఒక భారతీయ ట్రావెలర్ లో గుర్తించారు. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన ఆ వ్యక్తి..అక్టోబర్ 25న సింగపూర్ వెళ్లాడు.  

JN.1 గతంలో కోవిడ్ వేరియంట్స్ కంటే బలమైనది అయినప్పటికీ టీకాలు దానిపై ప్రభావం చూపుతున్నాయని.. JN.1 వేరియంట్ పట్ల భారత్ అప్రమత్తంగా ఉందని.. ఇప్పటివరకు ఈ వేరియంట్ తో ఆస్పత్రుల్లో ఎవరూ చేరలేదని..ఇదిఅంత ప్రమాదకరమేమి కాదని భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న బయోటెక్నాలజీ విభాగంINSACOG తెలిపింది. 

ఏడు నెలల విరామం తర్వాత భారత్ లో కేసులు పెరుగుతున్నాయి.కేరళలో ప్రజలకు కోవిడ్ సోకుతున్నట్లు నివేదికలు చెపుతున్నాయి. అయితే మునపటి వేరియంట్ల కంటే అంత ప్రభావం చూపలేదని .. నేషనల్ ఇండియన్ అసోసియేషన్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ కో చైర్మన్ రాజీవ్ జయదేవన్ తెలిపారు. 

భారత్ లో కోవిడ్ కేసులు 

భారత్ లో శుక్రవారం (డిసెంబర్15) ఒక్కరోజే 312 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఇది 2023 మే 30తర్వాత ఇదే అత్యధికం. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,296కు పెరిగింది. మరణాల సంఖ్య 5లక్షల 33వేల 310 కాగా దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.50 కోట్లకుచేరింది.