కోవిడ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించాలి

కోవిడ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించాలి

హైద‌రాబాద్: ప్ర‌జ‌లంద‌రికీ కోవిడ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు డీవైఎఫ్ఐ నేత‌లు. కరోనా రోగుల పట్ల ప్రభుత్వం తీరును నీరసిస్తూ.. ఆదివారం గాంధీ హాస్పిట‌ల్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడి నేత‌లు సీఎం కేసీఆర్ పనితనం రోమ్ నగరం తగలబడుతుంటే పిడేలు వాయించుకుంటున్న రాజు లాగా ఉందని విమర్శించారు. నాలుగు కోట్ల జనాభా ఉన్న తెలంగాణకు ఒక్క గాంధీ హాస్పిట‌ల్ లోనే చికిత్స అందచేయడమెంటని ప్రశ్నించారు.

ఇప్పటికైనా మేల్కొని అందరికి కోవిడ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుండి వచ్చిన నిధులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక వేల కోట్ల నిధులు విరాళంగా దాతల నుండి వచ్చాయని.. అవ్వేమి అయ్యాయని ప్రశ్నించారు. కరోనా బారిన పడిన ప్రాంతాలలో పటిష్టమైన చర్యలు చేపట్టి, హైద్రాబాద్ ను, తెలంగాణను కాపాడాలని డిమాండ్ చేశారు. లేని యెడల టీఆరెస్ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు డీవైఎఫ్ఐ నేత‌లు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి