
నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లాకు చెందిన ఓ రైతు తను పెంచుకునే ఆవుకు ఘనంగా సీమంతం నిర్వహించారు. నర్సంపేట మండలం దాసరిపల్లికి చెందిన పెండ్యాల సురేందర్ గోపాల మిత్రగా పని చేస్తున్నారు. నాలుగేండ్ల కింద హనుమకొండలోని మహర్షి గోశాల నుంచి ఆవు దూడను తెచ్చుకున్నారు.
గౌరీగా పేరు పెట్టి పెంచుకుంటున్నారు. కృత్రిమంగా గర్భధారణ దాల్చిన గౌరీకి 5 నెలలు. కాగా ఇంటి ఆడబిడ్డ లెక్కనే సీమంతం చేసేందుకు సురేందర్ నిర్ణయించుకున్నారు. శుక్రవారం వేడుకను నిర్వహించగా.. ఇరుగు పొరుగుతో పాటు ముత్తైదువలను ఆహ్వానించారు. పిండి వంటలతో పాటు పండ్లు, పూలు తెచ్చి సీమంతం ఘనంగా చేశారు. అర్చకులతో సంప్రదా య పద్ధతిలో పూజలు చేయించాడు. వేడుక ను చూసేందుకు గ్రామస్తులు భారీగా తరలివచ్చారు.