
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు చెక్‌పోస్టుల వద్ద లాక్‌డౌన్ అమలును, తనిఖీలను సీపీ అంజనీ కుమార్ పరిశీలించారు. అంబర్ పేట్, ఛే నెంబర్, పారడైజ్, రసూల్‌పుర చెక్ పోస్టుల వద్ద తనిఖీలను పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘దేశంలో హైదరాబాద్ నాలుగో పెద్ద నగరం. కోటి 20 లక్షలకు పైగా జనాభా ఉంది. ముంబై, బెంగళూరు, ఢిల్లీతో పోల్చితే హైదరాబాద్‌లో కరోనా కేసులు తక్కువ. అదేవిధంగా మరణాలు కూడా తక్కువ. ప్రజలందరి ఆరోగ్యం, క్షేమం కోసమే ఈ లాక్‌డౌన్. లాక్‌డౌన్‌లో డైలీ 8 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికి 5 వేల వాహనాలను సీజ్ చేశాం. ఉదయం 10లోపు అందరూ ఇళ్లకు చేరుకోవాలి. 10 దాటిన తర్వాత అనుమతి లేని వాహనాలు రోడ్డు మీదకు వస్తే సీజ్ చేస్తాం. ఈ లాక్‌డౌన్ మన కోసమే. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి’అని ఆయన అన్నారు.