పోలీసింగ్‌‌‌‌‌‌‌‌ లో టెక్నాలజీని వాడుకోవాలి : కరీంనగర్ సీపీ గౌష్ ఆలం

పోలీసింగ్‌‌‌‌‌‌‌‌ లో టెక్నాలజీని వాడుకోవాలి : కరీంనగర్ సీపీ గౌష్ ఆలం
  •     సీపీ గౌష్‌‌‌‌‌‌‌‌ ఆలం 

హుజురాబాద్, వెలుగు:  జూన్ 15లోగా ప్రివెంటివ్ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌, సీసీటీఎన్​ఎస్‌‌‌‌‌‌‌‌ 2.0, ఈ సాక్ష్య యాప్‌‌‌‌‌‌‌‌లో పూర్తి వివరాలను నమోదు చేయాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా హుజూరాబాద్ ఏసీపీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ను తనిఖీ చేశారు. కార్యాలయాన్ని, పెండింగ్ కేసులు, రికార్డులను పరిశీలించారు. పోలీసింగ్‌‌‌‌‌‌‌‌లో సాంకేతికతను వినియోగించాలన్నారు. 

కేసుల ఆధారాల సేకరణలో ‘ఈ -సాక్ష్య’ను సమర్థంగా వినియోగించాలని సూచించారు. గత నెలలో కరీంనగర్ పీఎంజే నగల షోరూంలో జరిగిన దారిదోపిడీ ఘటనను దృష్టిలో ఉంచుకుని కమిషనరేట్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. కార్యక్రమంలో ఏసీపీ మాధవి, సీఐలు కరుణాకర్, రామకృష్ణ, వెంకట్, శ్రీనివాస్, ఎస్సైలు స్వాతి, తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.